కౌలుదారి చ‌ట్టాన్ని పున‌రుద్ధ‌రిస్తాం బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్

 

జ‌గిత్యాల జూలై 3 (globelmedianews.com)

తెలంగాణ రాష్ట్రంలో ఆరుగాలం శ్ర‌మించి పంట పండించే రైతులు అటు సాగుబ‌డి లేక‌, ఇంటు పండించిన పంట‌ల‌కు గిట్టాబాటు ధ‌ర రాక అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ని, వ్య‌వ‌సాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి అన్న‌దాత‌లు అవ‌స్థ‌ల్లో ప‌డ్డార‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.మార్పుకోసం జ‌న‌చైత‌న్య యాత్రలో భాగంగా  ప‌దో రోజు జ‌గిత్యాల బ‌య‌లుదేరే ముందు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అర్మూర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో చిట్ చాట్‌లో చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో రావ‌ని, ఒక‌వేళ వ‌చ్చినా మేం సిద్ధ‌మ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పున‌రుద్ఘాటించారు. కేంద్రం నుంచి ముంద‌స్తు గురించి ఎలాంట‌లి స‌మాచారం లేద‌ని, బిజెపికి వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మి ఎర్ప‌డినా బిజెపి న‌ష్టం ఏం లేద‌న్నారు.ఉప ఎన్నిక‌ల్లో ఒక‌టి అరా గెలవొచ్చు కాక.. కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉంటార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.  
 
 
 కౌలుదారి చ‌ట్టాన్ని పున‌రుద్ధ‌రిస్తాం     బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్
 
బిజెపికి వ్య‌తిరేకంగా క‌త్తులు దూసుకున్న పార్టీలు బిజెపిని ఓడించ‌లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ మా అండ దండ అని, మ‌రి విప‌క్షాలు ఎవ‌రిని చూపి ప్ర‌జ‌ల్లోకి వెళ‌తార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. నియంతృత్వ టీఆర్ఎస్ పాల‌న‌తో విసుగు చెందిన బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జానీకం మొత్తం ఇవాళ బిజెపి వైపు ఆశ‌గా చూస్తున్నార‌ని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఇత‌ర పార్టీల వైపు చూస్తోంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ఎద్దేవా చేశారు.బిజెపి వ‌ర్సెస్ కాంగ్రెస్ అనే ఎప్పుడో మ‌స‌క‌బారి పోయింద‌ని, మోదీ అధికారంలోకి వచ్చే నాటికి... 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్...ఇవాళ రెండు రాష్ట్రాల‌కే ప‌రిమ‌తం అయింద‌న్నారు. కూట‌మి ఏర్పాటు మూన్నాళ్ల ముచ్చ‌టే అని, గ‌తంలో చ‌ర‌ణ్‌సింగ్ ఉదంతం ఎవ‌రూ మ‌ర‌వ‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ గుర్తు చేశారు. కౌలు రైతుల‌ను కిరాయిదారులని సీఎం కేసీఆర్ అన‌డం అన్యాయ‌మ‌ని, కౌలు రైతుల హ‌క్కులు, కౌలు దారుల లెక్క‌లు బూర్గుల రామ‌కృష్ణారావు తెచ్చిన చ‌ట్టంలో స్ప‌ష్టంగా ఉన్నాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధ‌కారంలోకి రాగానే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ, రైతుల‌కు ఉచితంగా బోరు బావులు వేయించి ఇస్తామ‌ని, పంట పెట్టుబ‌డి వ్య‌యాన్ని త‌గ్గిస్తామ‌ని డాక్ట‌ర్ లక్ష్మ‌న్ హామీ ఇచ్చారు. నిజ‌మాబాద్‌లో పుసుపుబోర్డు ఏర్పాటే చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని, స్పైస్ బోర్డు పేరుతో ఏ ప్రాంతాల్లో ఏ పంట‌లు ఎక్కువ‌గా పండుతాయో వాటికి అనుగుణంగా స్కిల్స్, మార్కెటింగ్ విధానం, విదేశాల‌కు ఎగుమ‌తి చేసే అంశాల‌ను రైతుల‌కు తెలిసే విధంగా అధికారుల‌తో బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు.  ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనేది ఓ ఫ్యామిలీ ఫ్రంట్ అని.. అందులో క‌విత‌, కేటీఆర్, హ‌రీష్‌, సంతోష్ త‌ప్ప‌.. మ‌రెవ‌రూ లేర‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. టెంటే లేదు.. ఫ్రంట్ ఎక్క‌డిదని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ వ్యంగ్య‌స్త్రాలు సంధించారు. మోదీ అమలు చేస్తున్న ప్ర‌జా సంక్షేమ‌ప‌థ‌కాల‌తో దేశంలో 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంద‌ని, ఇక తెలంగాణ‌లోనూ విజ‌య బావుటా ఎగుర‌వేయ‌డం ఖాయ‌మ‌ని, ఈ ఆరు నెల‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.అనంతరం జ‌గిత్యాలలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో అశేష ప్ర‌జానీకాన్ని ఉద్దేశించి డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌సంగించారు. తెలంగాణ ద్రోహుల‌ను ప‌క్క‌న పెట్టుకుని..బంగారు తెలంగాణ నిర్మిస్తామంటూ మ‌భ్య‌పెడుతున్నార‌ని, ఈ దేశాన్ని పాలించ‌డం త‌మ జ‌న్మ‌హ‌క్కుగా భావించి  కాంగ్రెస్ బిజెపిపై కుట్ర‌ల‌కు తెర‌తీసింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ధ్వ‌జ‌మెత్తారు.  రాష్ట్రాన్ని ప‌ట్టి పీడిస్తున్న కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు ఇక్క‌డి మ‌హిళ‌లు బోన‌మెత్తార‌ని స‌భ‌కు త‌ర‌లివ‌చ్చిన మ‌హిళ‌ల‌ను ఉద్దేశంచి డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. ఉద్య‌మాల పురిటిగ‌డ్డ అయిన జ‌గిత్యాల నుంచి మార్పు మొద‌లు కావాల‌ని..ఆ మార్పు తాకిడికి కేసీఆర్ స‌ర్కార్.. అడ్ర‌స్ గల్లంతు కావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్  ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.పాల‌కుల అణ‌చివేత చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టేందుకు, ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకే బిజెపి ఈ జ‌న చైత‌న్య యాత్ర‌తో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చింద‌న్నారు. అధికారంలోకి వ‌స్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని కేసీఆర్‌... ఇవాళ నాలుగేళ్ల‌యినా నిరుద్యోగ స‌మ‌స్య‌ను ఎందుకు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని, ఇంటికో ఉద్యోగం కాదు క‌దా...క‌నీసం ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా...? అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్‌ స‌భాముఖంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కేసీఆర్ ఇంటిలో మాత్రం ఇప్ప‌టికే ఐదు ఉద్యోగాలు ఇప్పించుకున్నార‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. కార్పొరేట్ సంస్థ‌ల కొమ్ముకాస్తున్న ఈ ప్ర‌భుత్వం.. టీఆర్‌టీపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా..ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు.ముఖ్య‌మంత్రి కేసీఆర్‌... కౌలు రైతుల‌ను కిరాయిదారులుగా పేర్కొంటూ....మొత్తం రైతాంగాన్ని  అవ‌మాన‌పరిచార‌ని, బిజెపి అధికారంలోకి రాగానే కౌలు రైతుల‌ను ఆదుకుంటామ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. ఉపాధి లేక భూమి లేక 10 ల‌క్ష‌ల మంది వ‌ల‌స కూలీలుగా గ‌ల్ఫ్ బాట ప‌డుతున్నార‌ని, బిజెపి అధికారంలోకి రాగానే గ‌ల్ఫ్ పాల‌సీ తీసుకువ‌స్తామ‌ని చెప్పిన టీఆర్ఎస్ నేత‌లు ఇంత‌వ‌ర‌కు ఆ ఊసే ఎత్త‌డం లేద‌న్నారు. న‌క్స‌లైట్లు జ‌నజీవ‌న స్రవంతిలో క‌లిస్తే.. ఉపాధి క‌ల్పించి ప‌రిహారం అందిస్తున్నారు.. అలాంటిది గ‌ల్ఫ్ బాధితుల‌ను ఆదుకునేందుకు ఎందుకు మ‌న‌స్సు రావ‌డం లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు.బిజెపి అధికారంలోకి వ‌స్తే నిజాం షుగ‌ర్స్ ఫ్యాక్ట‌రీ 100 రోజుల్లో తెరిపిస్తామ‌ని చెప్పి.. మాట మ‌రిచార‌ని, కేంద్రం రైతుల‌కు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే.. అది కూడా ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా ఈ పాల‌కులు మాయ చేస్తున్నార‌న్నారు. ఔట్ సోర్సింగ్ ఉండ‌ద‌ని చెప్పి వాళ్ల‌ను ప‌ర్మినెంట్ చేయ‌కుండా ఇబ్బందులు పెడుతున్నాన్నారు. ఇలాగే మొండిగా వ్య‌వ‌హ‌రిస్తే.. చివ‌రికి ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఔట్‌సోర్సింగ్‌గా భావించి తొల‌గిస్తార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ హెచ్చ‌రించారు. లాలూచీ ఒప్పందాల‌తో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ క‌లిసిపోయి.. బిజెపిపై అస‌త్య‌ప్ర‌చారాలు చేస్తున్నాయన్నారు. మ‌తోన్మాదుల‌ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న టీఆర్ఎస్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. టీఆర్ఎస్ మోసాల‌ను, అబ‌ద్ధాల‌ను ఎండ‌గ‌ట్టి.... కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేవ‌ర‌కు నీడ‌లా వెంటాడుతామ‌ని, అవినీతి, కుటుంబ పాల‌న, కుంభ‌కోణాల్లో రెండు పార్టీలూ ఒక్క‌టేన‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు. కార్మికులు, క‌ర్ష‌కులు, మ‌హిళామ‌ణులు, నిరుద్యోగ యువ‌త‌, విద్యార్థిలోకం అంతా క‌లిసి బిజెపికి అండ‌గా న‌డ‌వాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి అధికారంలోకి వ‌చ్చేలా ఆశీర్వ‌దించాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామ‌కృష్ణారెడ్డి, ఎండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌,  యాత్ర ప్ర‌ముఖ్ ధ‌ర్మారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు. యాత్ర ర‌థం స‌భా ప్రాంగ‌ణానికి చేరుకునే ముందు మ‌హిళ‌లు పెద్ద ఎత్తున బోనాల‌తో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ కు స్వాగ‌తం ప‌లికారు. యాత్రకు స్థానిక యువ‌త‌, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణంలో ఎక్క‌డ చూసినా బిజెపి జెండాలు రెప‌రెప‌లాడాయి. యువ‌త పెద్ద ఎత్తున భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. స‌భ‌కు హాజ‌రైన మ‌హిళామ‌ణులు, ప్ర‌జ‌ల ఉత్స‌హాన్ని చూస్తే..  టీఆర్ఎస్ స‌ర్కార్‌కు ఇక నూక‌లు చెల్లాయన్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది.

No comments:
Write comments