కేటీయార్ పుట్టిన రోజు సందర్భంగా టి-సాట్ లో రక్తదాన శిభిరం

 

హైదరాబాద్, జూలై 25 (globelmedianews.com) 
రాష్ట్ర మున్సిపల్, ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కె.టి.రామారావు పుట్టిన రోజు సందర్భంగా జూబ్లిహిల్స్ లోని టి-సాట్ కార్యాలయంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. టి-సాట్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రక్తదాన శిభిరంలో 21 మంది కార్యాలయ సిబ్బంది తమ రక్తాన్ని దానం చేశారు. టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి రక్తదానం చేసి, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రక్తదానం చేయడం వలన ఓ ప్రాణిని కాపాడిన వారమౌతామన్నారు. యువకులు, ఉత్సాహవంతులు రక్త దాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోయాలని పిలుపు నిచ్చారు. గౌరవ రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేటీయార్ పుట్టిన రోజు సందర్భంగా టి-సాట్ లో రక్తదాన శిభిరం

No comments:
Write comments