పేరంట్స్ ను కాదంటే..ఇక కష్టాలే

 

ముంబై, జూలై 17 (globelmedianews.com)
అమ్మానాన్న కష్టపడి సంపాదించిన ఆస్తిని దర్జాగా అనుభవిస్తూ.. వయసు మీదబడిన వారిని పట్టించుకోని పుత్రరత్నాలకు బ్యాడ్ న్యూస్. వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకున్నా లేదా హింసించినా.. ఇకమీద వారు మౌనంగా వేదన అనుభవించాల్సిన అవసరం లేదు. తమను పట్టించుకొని కుమార రత్నానికి గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. అంధేరీకి చెందిన ఓ సీనియర్ సిటిజన్ తన ఫ్లాటులో సగం వాటాను కొడుక్కి గిఫ్ట్‌గా ఇవ్వగా.. దాన్ని తిరిగి తీసేసుకోవచ్చన్న ట్రైబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్థించింది. 2007 నాటి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వృద్ధులకు అండగా నిలుస్తోంది. వృద్ధాప్యంలో తమకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చిన కొడుక్కి ఆస్తిని రాసిచ్చిన తల్లిదండ్రులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. 2007 తర్వాత వృద్ధులు తమ సంతానంతో జీవనభృతి కోసం ఒప్పందం కుదుర్చుకొని, వారు పట్టించుకోకపోతే.. ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు. పైన ఉదహరించిన అంధేరీ కేసులో.. సీనియర్ సిటిజన్ మొదటి భార్య 2014లో చనిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే కొడుకు, కోడలు కోరడంతో.. తన ఫ్లాట్‌లో సగం వాటా రాసిచ్చాడు. కానీ వారిద్దరూ అతడి రెండో భార్యను అవమానించడం మొదలుపెట్టారు. దీంతో సదరు సీనియర్ సిటిజన్ కోర్టును ఆశ్రయించాడు. గిఫ్ట్ డీడ్ ప్రకారం తండ్రిని సరిగా చూసుకోవడానికి కొడుకు, అతడి భార్య సుముఖంగానే ఉన్నారు. కానీ అతడి రెండో భార్యను చూసుకోవడానికి వారు ఆసక్తిగా లేరు. దీంతో తండ్రికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
 
 
 
పేరంట్స్ ను కాదంటే..ఇక కష్టాలే 

No comments:
Write comments