అల్లుడిని రంగంలోకి దింపే ఆలోచనలో జేసీ

 

అనంతపురం, జూలై 12, (globelmedianews.com)
అనంత‌పురం జిల్లా రాజకీయాల్లో మంత్రి జేసీ సోద‌రుల జోక్యం రోజురోజుకూ ఎక్కువ‌వుతోంద‌నే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈసారి త‌మ వార‌సుడిని రంగంలోకి దించాల‌ని ఎంపీ జేసీ దివాక‌ర‌రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడికి అడ్డొస్తార‌ని భావిస్తున్న పార్టీ నేత‌ల‌పైనే దుష్ప్ర‌చారానికి దిగార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌దుర్గం నుంచి అల్లుడు దీప‌క్ రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని యోచిస్తున్నారు. దీంతో మంత్రి వెనుక చాప‌కింద నీరులా త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి ఎర్త్ పెడుతున్నారు. ఆయ‌నకు ఈసారి టికెట్ ఇస్తే ఓడిపోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నార‌ట‌. త‌న అల్లుడి కోసం ఇలా సొంత పార్టీ నేత‌కే ఇలా వెనుక గోతులు త‌వ్వ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స‌మ‌ని జిల్లా నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలా అయితే పార్టీకి న‌ష్ట‌మేన‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు.అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల‌ను ఏళ్లుగా శాసిస్తున్న జేసీ కుటుంబం.. మరోసారి ఆధిప‌త్యాన్ని నిరూపించుకునేం దుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 
 
 
 
అల్లుడిని రంగంలోకి దింపే ఆలోచనలో జేసీ
త‌మ కుటుంబ స‌భ్యుల‌కు టికెట్ ఇప్పించుకునేందుకు సొంత పార్టీ నేత‌లకే ఎస‌రు పెట్టేస్తున్నారు. 1999లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించిన కాల్వ శ్రీనివాసులు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆ పార్టీ నేతల నుంచి హామీ రాకపోవడంతో ఆగిపోయారు. టీడీపీలోనే కొనసాగి రాయదుర్గం సీటు పొందారు. ఆ ఎన్నిక‌ల్లో కాల్వ చాలా త‌క్కువ మెజార్టీతోనే బయ‌ట‌ప‌డ్డారు. ఆ తర్వాత మంత్రి పదవినీ పొందిన ఆయనకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో విభేదాలు పొడచూపాయి.ఈ నియోజకవర్గం నుంచి 2004లో పోటీచేసి టీడీపీ నుంచి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఉపఎన్నికల్లో ఓడిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు, ప్రస్తుత‌ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని జేసీ ప్రోత్సహిస్తున్నారట‌. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేయడం ఖాయమని, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఎమ్మెల్సీల్లో ఇద్దరిలో ఒకరికి సీటు రావడం ఖాయమని జేసీ అనేక సందర్బాల్లో పరోక్షంగా చెప్పార‌ట‌. నియోజ కవర్గంలో ఎంపీకి వ్యతిరేకులైన వారికి మంత్రి కాల్వ పనులు చక్కపెడుతున్నారని ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని స్థానిక నేతలు చెబుతున్నారు.ఒక‌పక్క ఎంపీతోనేగాక మ్మెల్సీ గోవిందరెడ్డికీ మంత్రి కాల్వకు మధ్య దూరం పెరిగి విభేదాలు బయటపడ్డాయి. రాయదుర్గంలో మళ్లీ కాల్వ పోటీ చేస్తే.. వైసీపీ అభ్యర్థి సునాయాసంగా గెలుపొందుతారని జేసీ అనుచరవర్గం ప్రచారం చేస్తోంద‌ట‌. గతంలో జేసీకి అనుచరులుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఆయన ప్రోత్సహిస్తూ కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని, వారిని ఆర్థికంగా పెంచుతున్నారని మంత్రి కాల్వ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ దగ్గర బంధువైన దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు ఎంపీ జేసీ. అయితే ఇటీవల దీపక్‌రెడ్డి పలు కేసుల్లో ఇరుక్కోవడంతో.. ఆయన్ను కాదని ఇప్పుడు జేసీ.. మెట్టు గోవిందరెడ్డి వైపు దృష్టిసారించార‌ట‌. ఆయ‌న్ను ఫోక‌స్ చేస్తున్నార‌ట‌.

No comments:
Write comments