మల్టీ స్టారర్ గా సైరా

 

హైద్రాబాద్, జూలై 23 (globelmedianews.com)  
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సై రా సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా కోసం పలు భాషల‌ నటులు రంగంలోకి దిగుతున్నారు. ఇండియా లోని పలు భాష‌ల్లో విడుదల కానున్న ఈ సినిమా లో బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, కన్నడ నుండి సుదీప్, తమిళం నుండి విజయ్ సేతుపతి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే.. అమితాబ్ కు సంబంధించిన షూట్ పూర్తి కాగా.. ఇప్పుడు మిగతా నటుల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణలో సురేందర్ రెడ్డి నిమగ్నమయ్యాడు.ఇక సై రా షూటింగ్ కోసం కన్నడ నుండి కిచ్చ సుదీప్ కూడా ఎంటర్ అయ్యాడు. అక్కడ సై రా లొకేషన్స్ లో ఉన్న సుదీప్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీప్.. సై రా నరసింహ రెడ్డి లో చిరంజీవి గారితో కలిసి నటించడం తన అదృష్టమని.. అలాగే ఇంటర్నేషనల్ టెక్నిక‌ల్‌ టీమ్ తో పని చెయ్యడం లైఫ్ లో మరిచిపోలేని మ‌ధురానుభూతి అని ట్వీట్ చేసాడు. అంతే కాకుండా ఈ సినిమాలో తన రోల్ గురించి సీక్రెట్ కూడా సుదీప్ రివీల్ చేసాడు. సై రా నరసింహారెడ్డి లో తన రోల్ కాస్త క్రూయల్ గా ఉంటుందని చెప్పేసాడు.మరి సుదీప్ రోల్ కాస్త క్రూయల్ గా అంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో ఏ ఆంగ్లేయుడిగానో కనబడతాడని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. మరి హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్స్ లో భారీ బడ్జెట్ అంటే 42 కోట్లతో సైరా నరసింహారెడ్డి తో ఆంగ్లేయుల పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కీలక యాక్షన్ ఎపిసోడ్ సై రా నరసింహారెడ్డి సినిమాకే అత్యంత కీలకమని చెబుతున్నారు. మరి దీంతో సుదీప్ ఈ సినిమాలో ఒక ఆంగ్లేయుడిలా కనబడతాడని మనం ఫిక్స్ అవ్వోచ్చేమో. ఇంకా ఈ సినిమా లో నయనతార, తమన్నా, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు.
 
 
 
మల్టీ స్టారర్ గా సైరా
 

No comments:
Write comments