అదిలాబాద్ లో గులాబీ పార్టీ అంతర్మధనం

 

అదిలాబాద్, జూలై 7, (globelmedianews.com)
మధ్యంతర ఎన్నికల ఊహాగానాల కారణంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అంతర్మథనానికి సిద్దమవుతోందని అంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధినేత కె.చంద్రశేఖర్‌రావ్ ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ బలం, బలహీనతలను తెలుసుకొనేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై స్థానికంగా అసంతృప్తి పెరగడం, ప్రభుత్వ పథకాలు, విధాన పరమైన లోపాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను చేపడుతూ జనం దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై సిఎం సీరియస్‌గా దృష్టి సారించినట్లు చెబుతున్నా రు. 
 
 
 
అదిలాబాద్ లో గులాబీ పార్టీ అంతర్మధనం
 
ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు జోగురామన్న, ఐకె రెడ్డిలతో పార్టీ స్థితిగతులపై సమీక్షించినట్లు సమాచారం. అయితే ఏ నియోజకవర్గాలలో ఎంఎల్‌ఎల పరిస్థితి బలహీనంగా ఉందోమేననే అంశంపైనే సిఎం సీరియస్‌గా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాలలో పార్టీఈ పరిస్థితి ఊహిస్తున్నట్లు భిన్నంగా ఉన్నట్లు అధిష్టానం ఇప్పటికే తేల్చిందని అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులతో పకడ్బందీగా జరిపించిన రహస్య సర్వే ద్వారా ఈ అంశం వెల్లడైనట్లు సమాచారం. అంతరంగిక వేగులు అందించిన సమాచారంతోనే సిఎం అప్రమత్తమవుతూ ప్రత్యామ్నాయ చర్యలను సైతం అన్వేషించాలని మంత్రులిద్దరికీ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేల బలాలపై కూడా క్షుణ్ణంగా శోధించాలంటూ ఆయన మంత్రులిద్దరినీ కోరినట్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా మరో వారం రోజుల్లోగా చివరి దఫా సర్వే కూడా చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ సర్వే ఆధారంగా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయ నాయకత్వంను పరిశీలించాలన్న అభిప్రాయాన్ని తెర పైకి తెస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పలు నియోజకవర్గాలలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకులు ఈసారి టీఆర్‌ఎస్ టిక్కెట్‌ను ఆశిస్తుండడంతో ఆ దిశగా కూడా ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీనికి తోడుగా పార్టీ పరంగా అమలవుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా అ భివృద్థి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఏ మేరకు ఆదరణ లభిస్తుంద నే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా కాం గ్రెస్ పార్టీ నేతల కార్యకలాపాలకు లభిస్తున్న ఆదరణతో పాటు తట స్థ ఓటర్లు వారి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారన్న విషయాన్ని కూడా పరిశీలించబోతున్నారు. కాగా ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలతో లబ్ది పొందుతున్న వారి జాబితాను సిద్దం చేసి వారందరిని టీఆర్‌ఎస్ సానుభూతిపరులుగా మల్చుకోవాలన్న వ్యూహాన్ని సిద్దం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

No comments:
Write comments