కాళేశ్వరం పిటిషన్ ను తొసిపుచ్చిన సుప్రీం

 

న్యూఢిల్లీ, జూలై 9,(globelmedianews.com)
కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం  నాడు తోసిపుచ్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టు ను అవసరానికి మించి నీటి నిల్వ సామర్థ్యంతో కడుతున్నారని పిటిషన్ దాఖలుఅయిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరపున సినీయర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా తమ నిర్ణయాన్ని వెలుబరుస్తూ పిటిషప్ ను తొసిపుచ్చారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన  విషయం కాబట్టి మహారాష్ట్ర ఏదయినా అభ్యంతరం చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు కు రావాలని ధర్మాసనం స్సష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ కు  సూచించింది. ఇది అంతరాష్ట్ర వివాదం అన్న పిటీషనర్ వాదనను అంగీకరించని సుప్రీంకోర్టు పిటిషనర్ను  హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఒకవేళ హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా  నోటీసులు జారీ చేస్తే అప్పుడు తమ దగ్గరకి రావాలని చెప్పింది. 



కాళేశ్వరం పిటిషన్ ను తొసిపుచ్చిన సుప్రీం

No comments:
Write comments