పూర్తి స్థాయిలో నిండిన జూరాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు

 

జోగులాంబ గద్వాల, జూలై 20 (globelmedianews.com)
 జోగులాంబ గద్వాల జిల్లా లోని ఉమ్మడి పాలమూరు జిల్లా కు సాగునీటి వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరుతున్నది, వరదనీరు ఎక్కువగా వస్తుండటంతో నెట్టెంపాడు ప్రాజెక్టు కిందవుండే గుడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తున్నారు, దీనితో పాటు ప్రాజెక్టు ప్రధాన గేట్ల ద్వారా దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 17 గేట్లు ఎత్తి సుమారు 72890 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు, ఇందులో జూరాల లోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కి గాను 21488 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు, ప్రస్తుతము జురాలకు 1లక్ష 20 వేల 700 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా ఉన్నట్లు జూరాల అధికారులు తెలిపారు. ఈ నీళ్లలో గేట్స్ ద్వారా సుమారు 46468 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుద్వారా 1187 క్యూసెక్కులు,భీమా లిఫ్ట్-1 కు 1164, బీమా లిఫ్ట్-2 కు916 క్యూసెక్ ల నీటిని విడుదల చెస్తున్నట్లు అధికారులు తెలిపారు, అదేవిదంగా ఎడమ కాలువ కు 500, కుడి కలువద్వారా 315 నీటిని వదులుతున్నారు.
 
 
 
పూర్తి స్థాయిలో నిండిన జూరాల
 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు
 

No comments:
Write comments