రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి వుండకూడదు

 

అమరావతి, జూలై 24 (globelmedianews.com)  
దేశంలో రాజకీయ వాతావరణం బాగాలేదని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరి మీద అలిగినా ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిశా..అంతా ఆల్ రైట్ అని అన్నారు. మోడీ ప్రధాని గా ఉన్నంత వరకు హామీలు అమలు కావు. మా పోరాటం కొనసాగాల్సిందేనని అన్నారు. ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  తీర్మానం ఒట్టిమాట.  అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ వచ్చి చేస్తామనటం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు చెయ్యలేదు...ఇప్పుడు మాటలు చెపుతుంది.  పార్లమెంట్ కు వెళతానంటూ జేసీ హింట్ ఇచ్చారు.
 
 
 
రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి వుండకూడదు

No comments:
Write comments