వంద సంఖ్యపై కేసీఆర్ దృష్టి

 

హైద్రాబాద్, జూలై 23 (globelmedianews.com)  
తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం నిల‌బెట్టుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తోంది. దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగా త‌న ఖాతాలో వేసుకునేలా సీఎం కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న చోట అంతే బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను త‌న పార్టీ త‌ర‌పున నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మంలో బ‌ల‌మైన కాంగ్రెస్ నేత‌గా ఉన్న భ‌ట్టి విక్ర‌మార్క‌కు చెక్ పెట్టే దిశ‌గా కేసీఆర్ పావులు క‌దిపారు. ఈ బాధ్య‌త‌ను ఖ‌మ్మం జిల్లాకే చెందిన సీనియ‌ర్ నేత‌, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌గించారు. దీంతో తుమ్మ‌ల ఇప్పుడు ఆ ప‌నిపైనే బిజీగా ఉన్నారు.కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భట్టిని ఎదుర్కొని మధిర నుంచి పార్టీని గెలిపించుకోవాలనే పట్టుదలతో టీఆర్ఎస్‌ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా వర్గాలు, గ్రూపులకతీతంగా పార్టీని నడిపించేందుకు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావును మధిర నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమిస్తున్నట్లు మంత్రి తుమ్మ‌ల‌ స్వయంగా ప్రకటించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను కొండబాలకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
 
 
వంద సంఖ్యపై కేసీఆర్ దృష్టి
 
మధిర నియోజకవర్గంలో పార్టీ వర్గాలుగా విడిపోయి పలువురు నాయకులు ఎమ్మెల్యే పదవికి పోటీచేసేందుకు పోటీపడుతుండటంతోపాటు ఎవరికివారు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ పరిస్థితిని పసిగట్టిన అధిష్ఠానం ఎట్టకేలకు ఎన్నికల తరుణంలో కదిలింది.ఒక‌ప్పుడు టీడీపీకి ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌కు బ‌లం ఉన్న మ‌ధిర కోట‌ను 2009లో భ‌ట్టి విక్ర‌మార్క బ‌ద్ద‌లు కొట్టారు. 2009లో గెలిచిన భ‌ట్టి, గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్ గాలి రాష్ట్రవ్యాప్తంగా బ‌లంగా వీచినా ఇక్క‌డ మాత్రం ఆయ‌న మోత్కుప‌ల్లి న‌ర్సింహులును ఓడించి రికార్డు క్రియేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే మ‌ధిర‌ను గెలుచుకునేందుకు టీఆర్ఎస్ ఇక్క‌డ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తూ వ‌స్తోంది. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న్ను పార్టీలో చేర్చుకోవాల‌ని సీఎం కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే భ‌ట్టి మాత్రం పార్టీ మారేందుకు ఒప్పుకోలేదు.మధిరను గెలాగైనా గెల్చుకోవాలనే పట్టుదలతో ఉన్న నాయకత్వం ముందుగా నియోజకవర్గంలో పార్టీని ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. అందుకు మాజీ ఎమ్మెల్యే కొండబాలే సరైన నేతగా గుర్తించింది. అధినేత ఆదేశాలతో మధిరను గెలిపించే బాధ్యతలను అప్పగించింది. మధిర నుంచి పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అందరూ నాయకులు ఒకేవేదికపై నిలిచి గెలిపించుకొని రావాలని మంత్రి తుమ్మల దిశానిర్థేశం చేశారు. నియోజకవర్గంలో గ్రామస్థాయిలో అందరితో పరిచయాలు ఉన్న నేత కొండబాల. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రజలతో ప్రత్యక్షసంబంధాలు ఉన్నాయి.గ్రామాల్లో పేరు పేరుతో పిలిచే పరిచయం ఉంది. టీడీపీలో ఉండగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీని నడిపిన అనుభవం ఉంది. అధికార పదవిగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు దిశానిర్థేశం చేసేందుకు ఆ పదవి తోడ్పడుతుంది. ఈ మేరకు ఆలోచించిన నాయకత్వం మధిర బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మధిరలో భట్టిని ఎదుర్కొనేస్థాయి నేతను రంగంలోకి దింపాలని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా కాంగ్రెస్‌ను ఓడిపించాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ ప‌రిణామంతో భ‌ట్టికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత సులువుకాద‌న్న టాక్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో వినిపిస్తోంది.

No comments:
Write comments