సమంత యూ టర్న్ రెడీ

 

హైద్రాబాద్ జూలై 23 (globelmedianews.com) 
వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్  విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. రంగస్థలం, అభిమన్యుడు, మహానటి చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు నటిగా తన స్థాయిని పెంచుకొన్న సమంత ‘యూ టర్న్’తో తన నటవిశ్వరూపం చూపనుంది. ఆమె ఇంటెన్స్ లుక్స్, సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ‘యూ టర్న్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. దాదాపుగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ మొదలుపెడతారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
 
 
 
సమంత యూ టర్న్ రెడీ

No comments:
Write comments