ఆంధ్రా పక్షపాతం చాటుకున్న గులాం నబీ : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

 

హైదరాబాద్, జూలై 25 (globelmedianews.com)
కాంగ్రెస్ జాతీయ నేత గులాం నబీ ఆజాద్ పార్లమెంటు లో తన ఆంధ్రా పక్షపాతాన్ని బయటపెట్టుకున్నారు. ఏపీ పైనే తమకు ప్రథమ ప్రేమ,అనుబంధం  అని ఆజాద్ చెప్పడం కాంగ్రెస్ వైఖరి ని బహిరంగ పరచడమే నని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెస్సే అని కెసిఆర్ చెప్పారు ..అది ఆజాద్ మాటలతో రుజువైంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాకు అప్పుడూ ఇపుడూ కోవర్టులే. విభజన చట్టం లోని హామీలు ఏపీ కి అమలు చెస్తే మాకు అభ్యంతరం లేదు .పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తాం. 
 
 
 
ఆంధ్రా పక్షపాతం చాటుకున్న గులాం నబీ : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ 
 
తెలంగాణ అభివృద్ధి కి తెరాస కష్టపడుతుంటే కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోంది.  తెలంగాణ ను ఎండబెట్టి ఏపీ కి ప్రయోజనం చేయడమే కాంగ్రెస్ విధానమని తేలిపోయింది. ఇందిరాగాంధీ ని గెలిపించినందుకైనా తెలంగాణ పై కాంగ్రెస్ కొంత నైనా ప్రేమ ను ప్రదర్శించాల్సింది. ఆజాద్ వ్యాఖ్యల పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సమాధానం చెప్పాలని అయన డిమాండ్ చేసారు. సూర్యా పేట లో ఉత్తమ్ సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం . పాడిందే పాడరా అన్నట్టు ఉత్తమ్ గోబెల్స్ కు మించి దుష్ప్రాచారం చేస్తున్నారని అయన ఆరోపించారు. గోబెల్స్ బతుకుంటే కాంగ్రెస్ నేతల మాటలకు ఉరి వేసుకునే వారు. దోపిడీ కి డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ . ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ప్రజలకుంది కాబట్టే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బొంద పెట్టారు. కాంగ్రెస్ నేతలు నాన్న పులి అనే కథలా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పే అబద్ధాలతో భవిష్యత్ లో కాంగ్రెస్ నిజాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. సూర్యాపేట లో నేతలను సమన్వయం చేయలేని ఉత్తమ్ తెలంగాణ ప్రజలను ఎలా సమన్వయం చేస్తారని అడిగారు. మంత్రి జగదీశ్ రెడ్డి యాదృచ్చికంగా గెలిచారని ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఎవరూ యాదృచ్చికంగా గెలవరనే సంగతిని ఉత్తమ్ తెలుసుకుంటే మంచిదని అన్నారు. ఉద్యోగాల నియామకం పై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కెసిఆర్ ఎపుడూ చెప్పలేదు. కోటి కి పైగా ఉన్న కుటుంబాలకుఅన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా ? ఇప్పటికే 80 వేల కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిది. మరో అరవై వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలయ్యిందని అయన అన్నారు.

No comments:
Write comments