అయనకు మతిలేదు.. ఆ పార్టీకి గతి లేదు

 

అమరావతి, జూలై 25 (globelmedianews.com) 
మతి లేని నాయకుడు జగన్..గతి తప్పిన పార్టీ వైకాపా. ఢిల్లీలో పోరాడాల్సిన ఎంపీలు రాజీనామా చేసి ఇళ్లలో కూర్చున్నారు..అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన వాళ్లు ఆ వేదికను వదిలిపెట్టి రోడ్లపై తిరుగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  ప్రజాప్రతినిధులు అనే పదానికి అర్ధం లేకుండా చేశారు..ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, నియంతృత్వ విధానాలతో ప్రజల్లో వైకాపా చులకనైంది..వైకాపా నేతల్లోనూ అసంతృప్తి, అంతర్మధనం మొదలైంది.  
 
 
 
అయనకు మతిలేదు.. ఆ పార్టీకి గతి లేదు
 
జగన్ లక్ష్యం ఒక్కటే. సీఎం కుర్చీ కావాలి..మోదీతో లాలూచీ పడాలి..కేసుల నుంచి బయటపడాలని అన్నారు. టీడీపీ ఢిల్లీలో పోరాడుతుంటే..జగన్ రోడ్లపై తిరుగుతున్నారు. జీతాలు తీసుకోండి కానీ, చట్టసభలకు వెళ్లొద్దని వైకాపా ప్రజాప్రతినిధులకు జగన్ చెబుతున్నారు.  ఢిల్లీలో పోరాడే దమ్ములేక పదేపదే బంద్ లకు పిలుస్తుంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. బంద్ వల్ల రాష్ట్రానికే నష్టం..వస్తు సేవల పన్ను ఒక్క రోజు ఆదాయానికి రూ.190 కోట్ల నష్టం వాటిల్లింది..ఆర్టీసీకి రూ.8 కోట్ల నష్టం.  జగన్ కు ఆలోచించే శక్తి లేకుండా పోయింది.  టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటాడు..ఒక సాధారణ పౌరుడికి ఉండే ఆలోచన కూడా జగన్ కు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వాజ్ పేయ్, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ప్రతిపక్ష నేతలుగా ఎన్నడూ అధికారాన్ని కోరుకోలేదు.  దశాబ్దాల పాటు అధికార పార్టీల పొరపాట్లను సరిదిద్దుకునేలా చేస్తూ ప్రజలకు అండగా నిలిచారు. సీఎం కుర్చీలో వేరే వాళ్లు కూర్చుంటే చూడలేక రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండే జగన్ లాంటి వారిని ఎక్కడా చూడలేదు.  తండ్రి అధికారంలో ఉంటే కుమారులు ఏమైనా చేయవచ్చని వీరవిహారం చేసి భారీ అవినీతికి పాల్పడి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు.  పారిశ్రామికవేత్తలను జైళ్లకి పంపి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు.  నీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం తేబోకు. జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఢిల్లీకి వెళ్లి పోరాడే దమ్ము లేదని మంత్రి వ్యాఖ్యానించారు. జనసేన అధినేత సినిమాల్లో మంచి హీరోనే..రాజకీయాల్లోనే ఆయన తీరు అంతుబట్టడం లేదని అయన అన్నారు.

No comments:
Write comments