అప్పుల ఊబిలో రాష్ట్రం : సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి

 

హైదరాబాద్, జూలై 9,(globelmedianews.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ప్రాజెక్టు ల లో రెండు సంవత్సరాలు వెనక్కి నెట్టారు. గత ప్రభుత్వ కార్యక్రమాలను మార్పు చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం, మెడిగడ్డ కు తరలింపు వల్ల ఒక లిఫ్ట్ బదులు మూడు లిఫ్ట్ లు అవసరం అవుతున్నాయి. తుమ్మిడిహెట్టి దగ్గరే బ్యారేజ్ నిర్మిస్తే ఒకటే లిఫ్ట్ అవసరం వచ్చేది.గ్రావిటీ ద్వారా పొందే నీళ్లు పొంది మిగిలినవి లిఫ్ట్ చెయ్యాలి. కానీ తాను అన్నదే నెగ్గడం కోసం ఖజానా మీద భారం పెంచారని విమర్శించారు. మెడిగడ్డ నుండి అన్నారం, అన్నారం నుండి సుందిళ్ళ కు వచ్చే రెండు లిఫ్టు లు, ఇక బ్యారేజ్ .. అవసరం రాకపోయేదని అయన అన్నారు. 20 వేల కోట్లు ఖజానా మీద భారం పడింది ఇప్పుడు. తుమ్మిడిహెట్టి దగ్గరే కడితే  పోయిన ఏడాది నుండే నీటి వినియోగం కూడా జరిగేది. జాతీయ ప్రాజెక్టు గా కూడా గుర్తించే అవకాశం కోల్పోయామమని అయన అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, మూర్ఖపు ఆలోచనలు దీనికి కారణం. ఖజానాకు భారం. ప్రచార ఆర్భాటలతో ... ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  అప్పుల ఊబిలో రాష్ట్రం : సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి

No comments:
Write comments