మెజార్టీకి, నైతికతకు మధ్య పోరాటం జాతీయ మీడియాతో చంద్రబాబు

 

న్యూఢిల్లీ, జూలై 21 (globelmedianews.com) 
దేశ రాజధాని ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ... మాట తప్పారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఢిల్లిలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన కేంద్రం ఆ పని చేయలేక పోయిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ చాలాసార్లు చెప్పారన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ హోదా ఇస్తామన్నారు. కానీ ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ఇచ్చామో జాతికి వివరించడానికి తాను ఢిల్లికి వచ్చానని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్డిఎనుంచి తాము ఏం ఆకాంక్షించామో, చివరకు వారేం చెప్పారో వివరించాలని వచ్చానని ఆయన అన్నారు. బిజెపికి పూర్తి మెజారిటీ ఉందని తెలిసీ అవిశ్వాసం పెట్టామని ఆయన చెప్పారు.  ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని... మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  30 ఏళ్ల తరువాత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చామని ప్రధాని మోడీ చెప్పారని, దానిని తాము అంగీకరిస్తున్నామని ఆయన అన్నారు. అయితే అందులో తమ భాగస్వామ్యం కూడా ఉందని ఆయన అన్నారు. విభజన సమయంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి, ప్రస్తుత ఆర్థిక మంత్రి డిమాండ్ మేరకే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లి పర్యటన చేశానన్నారు. ఏ రాష్ట్రానికి పన్ను రాయితీలు లేవన్నారని, కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తున్నారన్నారు.
 
 
 
మెజార్టీకి, నైతికతకు మధ్య పోరాటం
జాతీయ మీడియాతో చంద్రబాబు
 

No comments:
Write comments