కొనసాగుతున్న ఇసుక సిండికేట్ల మాయాజాలం

 

బెజవాడ, జూలై 14, (globelmedianews.com)
ఉచిత ఇసుక అందని ద్రాక్ష పండుగా మారింది. జిల్లాలో మొత్తం 72 ఇసుక క్వారీలు ఉండగా కేవలం ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి ఇసుక క్వారీ మాత్రమే నడవడం వెనుక ఇసుక సిండికేట్ల మాయాజాలం కనిపిస్తోంది. ఒక పధకం ప్రకారం మొదట డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక వ్యాపారం అని చెప్పి తరువాత కొన్ని వేల కోట్ల రూపాయల ఇసుకను అమ్ముకున్న ఘనత ఇసుక సిండికేట్లకు దక్కిందనీ కొందరు నాయకుల కనుసన్నల్లో ఈ ఇసుక దందా నడుస్తోందనీ ఆరోపిణలు వినిపిస్తున్నాయి. ఒకే ఒక ఇసుక క్వారీ నడుస్తుందనే సాకును చూపి దారుణంగా ఇసుకను అమ్ముకుంటున్నారన్నారు. దీని వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందనీ, భవన నిర్మాణ కూలీలు పనులు లేక రోడ్డున పడాల్సి వస్తోంది.. ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే లారీ ఇసుక రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకూ ఖర్చు అవుతుందన్నారు. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలకు మించిపోతుండడంతో అనేక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దారిమళ్లించకుండా చర్యలు చేపడతామన్న ప్రభుత్వ ప్రకటనలు ఎక్కడా వాస్తవ రూపం దాల్చలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇసుక దందాకు సహకరించినందుకుగానూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని జిల్లాలో ఉన్న అన్ని ఇసుక క్వారీలనూ తెరిపించే విధంగా చర్యలు చేపట్టి ఇబ్రహీంటప్నంలోని ఇసుక దందాను కట్టడి చేసి ప్రజలందరికీ ఇసుకను ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. కొనసాగుతున్న ఇసుక సిండికేట్ల మాయాజాలం

No comments:
Write comments