పదివికెట్లు, పది నో బాల్స్..తో పేసర్ శ్రీ కాంత్ రికార్డ్

 

ముంబై, జూలై 2, (globelmedianews.com)

క్రికెట్‌లో ఒకే బౌలర్ పదికి పది వికెట్లు తీయడం చాలా కష్టం. విదర్భ పేసర్ శ్రీకాంత్ వాఘ్ ఇంగ్లాండ్‌ గడ్డ మీద సంచలన ప్రదర్శన చేశాడు. స్టోక్‌స్లే క్లబ్ తరఫున బరిలో దిగిన శ్రీకాంత్ పది వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. గతంలో భారత్-ఏ తరఫున ఆడిన శ్రీకాంత్ నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ దుర్హమ్ (ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్ లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. మిడిల్స్‌బ్రో సీసీ జట్టుపై 11.4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. దీంతో స్టోక్స్‌స్లే జట్టు 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అతడు పది నోబాల్స్ విసరడం గమనార్హం. గతంలో భారత్ తరపున అనిల్‌ కుంబ్లే టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీశాడు. అయితే మరో భారత బౌలర్‌ పది పదికి వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. విదర్భ ఆటగాడు శ్రీకాంత్‌ వాగ్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు.ఇంగ్లండ్‌ వేదికగా జరిగే నార్త్‌ యార్క్‌షైర్‌-సౌత్‌ దుర్హామ్‌(ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్‌ లీగ్‌లో భాగంగా స్టోక్స్‌స్లే క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడిన శ్రీకాంత్‌ వాగ్‌.. రెండు రోజుల క్రితం మిడిల్స్‌ బ్రాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిపోయాడు. మొత్తంగా 11.4 ఓవర్లు వేసిన వాగ్‌ 1 మెయిడిన్‌ సాయంతో 39 పరుగులిచ్చి పది వికెట్లను నేలకూల్చాడు. ఈ విషయాన్ని ఎన్‌వైఎస్‌డీ తన అధికారిక ట‍్వీటర్‌లో తెలిపింది.గతంలో ఇర్పాన్‌ పఠాన్‌ ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 2003-04 అండర్‌-19 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్పాన్‌ పఠాన్‌ తొమ్మిది వికెట్లు సాధించాడు.

పదివికెట్లు, పది నో బాల్స్..తో పేసర్ శ్రీ కాంత్ రికార్డ్

No comments:
Write comments