హోదా హామీకి కట్టుబడి వున్నాం : రఘువీరా

 

విజయవాడ, జూలై 27, (globelmedianews.com)
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం. ఇది ఏ రాష్ర్టానికి పోలిక అవసరం లేదని రాహుల్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చేది.విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం ఏపీ కి లేకపోవడంతో అక్కడ ఇబ్బందులు వస్తున్నాయని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.  శుక్రవారం నాడు అయన ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీడబ్యూసి తీసుకున్న నిర్ణయమే పార్టీ ఫైనల్. రాహుల్ కు రాష్ట్ర పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ ప్రసంగం ను రాష్ట్రం లో భాగా ప్రచారం చేస్తం. చంద్రబాబు ఇన్ని రోజులు బీజేపీ తో కలిసే ఉన్నారుగా. జగన్ ఇంకా బీజేపీ తో కలిసే నడుస్తున్నాడు. మరి ఏంధుకు ప్రత్యేక హోదా సాధించలేదు. బీజేపీ సరసన మీరు ద్రోహులుగా నిలబడ్డాడని అన్నారు. ప్రత్యేక హోదా హామీ కి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. విభజన చట్టం అమలు కావాలంటె 25 కు 25 ఏంపీ స్దానాలు కాంగ్రెస్ గెలవాలి. కేసీఆర్ ,కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేకే వీరందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగాఉంటామని పార్లమెంట్ బయట ,వెలుపల అనేక సార్లు చెప్పారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని ,బీజేపీ ని కాపాడాలని టిఆర్ఏస్ చూస్తొంది.. తెలంగాణ లో రాజకీయ లబ్దికోసం టిఆర్ఏస్ ప్రయత్నం... బీజేపీ ఈ ఆటవెనక ఉందని అయన అన్నారు. వ్యక్తి గతంగా ఏవరు ఏవరినీ  తిట్టకూడదు. ప్రాంతీయ పార్టీలకు విధానాలు లేవు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటాయి ప్రాంతీయ పార్టీలని అయన అన్నారు. హోదా హామీకి కట్టుబడి వున్నాం : రఘువీరా

No comments:
Write comments