చరణ్ తో ప్రియాంక చోప్రా

 ముంబై, జూలై 2, (globelmedianews.com)

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతో కలిసి మరోసారి నటించాలనుందని మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఐదేళ్లక్రితం వీరిద్దరూ కలిసి నటించిన ‘జంజీర్’ సినిమా (తెలుగులో ‘తుఫాన్’) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నానని.. కానీ.. ఫలితం తనని నిరాశపరిచిందని ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ వెల్లడించాడు. అయితే.. మరోసారి అవకాశం దక్కితే.. ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తానని మెగా పవర్‌స్టార్ చెప్పుకొచ్చాడు. ‘బాలీవుడ్‌లో అది నాకు తొలి చిత్రం. కాబట్టి.. చాలా కష్టపడ్డాను. కానీ.. ఫలితం నిరాశపరిచింది. అయితే.. బాలీవుడ్‌లో ప్రయత్నాలు మాత్రం మానుకోను. మంచి కథ దొరికితే.. మరోసారి బాలీవుడ్‌లో సినిమా చేసేందుకు రెడీ. అలానే ప్రియాంక చోప్రాతో కూడా. ఆమె చాలా అందమైన, ప్రతిభ ఉన్న నటి’ అని రామ్‌చరణ్ వెల్లడించాడు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో చేస్తున్నారు.. మీరు కూడా ఆవైపు వెళ్లే ఆలోచనలు ఏవైనా ఉన్నాయా..? అని ప్రశ్నించగా.. ‘హాలీవుడ్‌ ఆలోచనలైతే ప్రస్తుతానికి లేవు. తెలుగు ఇండస్ట్రీలో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నాకు నప్పే కథలతోనే ప్రయాణం సాగిస్తా’ అని ఈ మెగా హీరో స్పష్టం చేశాడు. చరణ్ తో ప్రియాంక చోప్రా

No comments:
Write comments