ప్రత్యేక ప్యాకేజీకి తాను ఎప్పుడూ ఒప్పుకోలేదు మోదీ తన గురించి చేసిన వ్యాఖ్యలు చాలా భాధ కలిగించాయి యూటర్న్ తెసుకుంది ఆయనే..నేను కాదు కళంకితులతో ఉంది ఆయన వారితో నన్నేల పోల్చుతారు ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు

 

న్యూ డిల్లీ జూలై 21 (globelmedianews.com)
ప్రత్యేక ప్యాకేజీకి తాను ఒప్పుకున్నానని మోదీ చెప్పారని... ప్యాకేజీకి తాను ఎప్పుడూ ఒప్పుకోలేదని ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు. శని వారం ఇక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా ఆ సాయాన్ని ఆపేయాలనుకుంటున్నామని, హోదాకంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారని, ఆ తర్వాత 11 రాష్ట్రాలను హోదాను కొనసాగించారని మండిపడ్డారు. ప్రత్యేక నిధుల కోసం లేఖ ఇవ్వాలని ఒకసారి, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులు ఇస్తామని మరోసారి, ఇలా కథలు చెప్పుకుంటూ వచ్చారని విమర్శించారు. లోక్ సభలో ప్రధాని మోదీ తన గురించి మూడు, నాలుగు విషయాలు లేవనెత్తారని... ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా భాధను కలిగించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, హైదరాబాదుకు ఒక అందమైన రూపం ఇచ్చిందని తానేనని చంద్రబాబు చెప్పారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు హైదరాబాదు నిలవడం పట్ల తాను ఎప్పుడూ గర్వపడతానని తెలిపారు. హైదరాబాదులోని ఆస్తులను తాను ఎన్నడూ అడగలేదని, న్యాయం చేయాలని మాత్రమే కోరానని చెప్పారు. హైదరాబాదు రూపంలో తాము కోల్పోయిన దాన్ని భర్తీ చేయాలని మాత్రమే తాను కోరానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఏపీ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఏపీ ప్రజల దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.కేసీఆర్ తో ఇబ్బంది లేదు, ఇబ్బందులన్నీ చంద్రబాబుతోనే అని మోదీ అనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఇలా మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.
 
 
 
ప్రత్యేక ప్యాకేజీకి తాను ఎప్పుడూ ఒప్పుకోలేదు
మోదీ తన గురించి చేసిన వ్యాఖ్యలు చాలా భాధ కలిగించాయి
యూటర్న్ తెసుకుంది ఆయనే..నేను కాదు
కళంకితులతో ఉంది ఆయన వారితో నన్నేల పోల్చుతారు 
ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు
 
 మీ అందరికంటే ముందుగానే తాను సీఎం అయ్యాయని చెప్పారు. మోదీ 2002లో సీఎం అయితే, 1995లోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మోదీ ఏం సాధించాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు. తానే ఇబ్బందులు కలిగిస్తున్నానని మోదీ అన్నారని... ఇద్దరు ముఖ్యమంత్రులతో కలసి మోదీ కానీ, గవర్నర్ కానీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని అన్నారు. అయినప్పటికీ, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.తాను యూటర్న్ తీసుకున్నానని మోదీ అన్నారని... యూటర్న్ తనది కాదు మీదే అని చంద్రబాబు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మీరే యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలో వైసీపీని మధ్యలోకి లాగే ప్రయత్నం చేశారని అన్నారు. నిన్న పార్లమెంటులో తమ పార్టీ ఉంటే, వైసీపీ అధినేత కోర్టులో ఉన్నారని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన ప్రధాని స్థానంలో ఉంటూ, ఇలాంటి పనికిమాలిన విషయాలను ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి తాము వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని చెప్పడానికి అర్ధరాత్రి సమయంలో మోదీకి ఫోన్ చేశానని... ఆ సమయంలో ఆయన డిన్నర్ లో ఉన్నారని, తమ ఎంపీలు కూడా డిన్నర్ లో ఉన్నారని... దీంతో, పార్టీ నిర్ణయాన్ని ఎంపీలకు వివరించానని, మోదీకి ఆ విషయాన్ని చెప్పాలని సూచించానని తెలిపారు.అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో మోదీ తనతో మాట్లాడలేదని... తాను మాత్రం మోదీ సెక్రటరీకి ఫోన్ చేసి తమ నిర్ణయాన్ని తెలిపామని, టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తారని, ఆ విషయాన్ని మోదీకి కూడా చెప్పాలని కోరానని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.మరుసటి రోజు ఉదయమే తనకు ప్రధానే ఫోన్ చేశారని... వైసీపీ ట్రాప్ లో మీరు పడుతున్నారని తనతో మోదీ అన్నారని చంద్రబాబు తెలిపారు. దీనికి సమాధానంగా... తాను కరెక్ట్ గా ఉన్నంత కాలం తనకు ఏమీ కాదని మోదీకి చెప్పానని అన్నారు. తనలాంటి కళంకం లేని వ్యక్తి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, కళంకిత వైసీపీతో ఎలా పోలుస్తారని మోదీని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అక్రమాస్తుల కేసులో ప్రతివారం కోర్టుకు వెళ్లే వ్యక్తికి చెందిన పార్టీతో టీడీపీని పోలుస్తారా? అని మండిపడ్డారు.ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడుతూ, అన్ని అక్రమాస్తుల కేసుల విచారణలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని, అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపుతామని చెప్పారని... స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పిస్తామని, ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును జమ చేస్తామని అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డితో కర్ణాటక ఎన్నికల సమయంలో చేతులు కలిపారని విమర్శించారు. ఇలాంటి కళంకితులతో తనను ఎలా పోల్చుతారంటూ మండిపడ్డారు. కళంకిత రాజకీయ నేతలతో మోదీ ఎలా కలసి పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను చాలా క్లీన్ అని చెప్పుకుంటున్న మోదీ... మరోపక్క ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు.

No comments:
Write comments