భరత్ అను నేను కు సీక్వెల్

 

హైద్రాబాద్, జూలై 28 (globelmedianews.com)  
ఇటీవలే వచ్చిన మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’కు సీక్వెల్ రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ గా నిలిచిన ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వరకూ హీరోలు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించిన సినిమాలతో ‘భరత్ అనే నేను’కు కొంత పోలిక వచ్చినా, ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్టుగా దీని రూపకర్తలు ప్రకటించారు. శ్రీమంతుడు’తో హిట్ కొట్టిన కొరటాల శివ, మహేశ్ బాబుల కాంబినేషన్ ‘భరత్..’తో మరో హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అనే మాట వినిపిస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమా మహేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి, దుష్టుల భరతం పట్టడంతో ముగుస్తుంది. పాలనాపరంగా కొన్ని మార్పులు కూడా చేస్తాడు హీరో. ఇప్పుడు సీక్వెల్ గనుక తీస్తే మహేశ్ ముఖ్యమంత్రిగా చేసే మార్పులను, ఎదుర్కొనే సవాళ్లను సినిమాగా చూపవచ్చు. ఈ మేరకు కథా,కథనాలు సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ బాబు ‘భరత్ అనే నేను..’ అంటూ మరోసారి గర్జించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్ ఊహాగానాలను కొరటాల శివ అండ్ టీమ్ ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది. భరత్ కు సీక్వెల్ అంటే మాత్రం మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం వస్తోంది. భరత్ అను నేను కు సీక్వెల్

No comments:
Write comments