ఖమ్మంలో 11 లక్షల కుటుంబాలకు కంటి వెలుగు

 

ఖమ్మం, ఆగస్టు 11, (globelmedianews.com)
ప్రతి ఒక్కరికీ వెలుగులు పంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.  ఒక అంచనా ప్రకారం 40 శాతం మంది వివిధ రకాల కంటి జబ్బులతో బాధపడుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా అమలు చేయలేదనీ, ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ చక్కని కంటి చూపు ఉండాలనీ, దృష్టి లోపాలన్ని సవరించనున్నారు. జిల్లాలో 11 లక్షల కుటుంబాలకు నేత్రవైద్య పరీక్షలు చేసేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. ఆరు నెలల పాటు జరిగే ఈ శిబిరాల్లో కళ్లద్దాలు ఇవ్వడం, కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి శస్త్రచికత్సలకు రిఫర్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై జిల్లా వైద్యారోగ్యశాఖ గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తోంది. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
 
 
 ఖమ్మంలో 11 లక్షల కుటుంబాలకు కంటి వెలుగు
 
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారిగా రంజిత్‌కుమార్ వ్యవహరించనున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసే కంటి వైద్య శిబిరాల్లో ప్రతిఒక్కరికి వైద్య పరీక్షలు చేసే విధంగా సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, పీహెచ్‌సీ వైద్యులకు అవగాహన కల్పించారు.కంటి వెలుగు పథకంలో ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మాత్రమే కళ్లద్దాలు ఇచ్చేందుకు వైద్యశాఖ ఇప్పటికే లక్షా 18 వేల కళ్లజోళ్లను జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి చేరవేసింది. కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష కళ్లద్దాలతో పాటు ఏఆర్ కంటి మిషన్లను డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉంచారు. 30 ఆటోరిఫ్లెక్టర్ మిషన్లను వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరో రెండ్రోజుల్లో తరలించనున్నారు. 15వ తేదీ నుంచి నిర్వహించే వైద్య శిబిరాలకు వైద్యులు, అప్తాలమిక్ అసిస్టెంట్లను నియమించారు. 31 మంది వైద్యులు , 31 మంది ఆప్తమెట్రిక్స్ విధుల్లో చేరే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ చేరవేసేందుకు 12 మంది అధికారులను ఒక టీమ్‌గా నియమించారు. డీఎంహెచ్‌వో బృందాలను పర్యవేక్షిస్తారు. జిల్లాలో ఆశలు, ఏఎన్‌ఎంలు పాల్గొంటారు.జిల్లాలోని 336 గ్రామాలతో పాటు 126 మున్సిపల్ వార్డుల్లో కూడా కంటి పరీక్షలు చేయనున్నారు. ఆరు నెలల పాటు నిర్వహించే ఈ కంటి పరీక్షల్లో ప్రతీ ఒక్కరికీ కళ్లద్దాలు ఇవ్వనున్నారు. రోజుకు గ్రామాల్లో 350 మందికి, పట్టణాల్లో 480 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ రిఫ్లెక్టర్ మిషన్ ద్వారా ఈ కంటి పరీక్షలు చేయడం వల్ల ఐదు నిమిషాల్లోనే కంటి పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల రోగికి కళ్లద్దాలు ఇస్తారు. 27 వైద్య శిబిరాలతో పాటు అదనంగా నాలుగు బఫర్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. వీరంతా వైద్య పరీక్షలు చేయనున్నారు.

No comments:
Write comments