పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం

 

న్యూ ఢిల్లీ ఆగష్టు 20 (globelmedianews.com)
పాకిస్థాన్ 22వ ప్రధానిగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేసారు. ఇటీవల జరిగిన  ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్.. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అధికారికంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి అయ్యారు. క్రికెటర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకూ ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ పీఎం కుర్చీలో కూర్చోవటం ద్వారా చరిత్రను సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే.. పాకిస్తాన్ లో వంశపారపర్యంగా వస్తున్న రెండు అతి పెద్ద పవర్ హౌస్ లను కొల్లగొట్టి మరీ.. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారని చెప్పాలి.  దేశ అధ్యక్షుడు మమ్ నూన్ హుస్సేన్ ఇమ్రాన్ చేత ప్రమాణస్వీకారాన్ని చేయించారు.ఎలాంటి ఆర్భాటం లేకుండా.. సింఫుల్ గా జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ఇండియన్ క్రికెటర్.. ఇమ్రాన్ స్నేహితుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. మరికొందరు సన్నిహితులు మాత్రమే ఈ ప్రమాణస్వీకారానికి హాజరైనట్లుగా చెబుతున్నారు.ఇటీవల  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని ఆర్టీ మొత్తం 272 స్థానాల్లో పోటీ చేసి 116 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన 21 స్థానాల దూరంలో ఇమ్రాన్ పరుగు ఆగింది. అయితే.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ కు 176 ఓట్లు రాగా.. షాబాజ్ షరీఫ్ కు 96 ఓట్లు వచ్చాయి. దీంతో.. ఇమ్రాన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ లో తన మార్క్ ప్రదర్శించిన ఇమ్రాన్.. తన కెప్టెన్సీలో జరిగిన 1992 వరల్డ్ కప్ లో పాక్ ను విజేతగా నిలిపారు. 1952లో ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇమ్రాన్.. 13 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడటం మొదలెట్టాడు.  1982 నుంచి 1992 వరకు పాక్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఒక క్రికెటర్ గా సక్సెస్ అయిన ఇమ్రాన్.. పాక్ ప్రధానిగా మరేం చేస్తారో చూడాలి.
 
 
 
పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం

No comments:
Write comments