తెలంగాణ తరఫున కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను సహాయం

 

హైదరాబాద్ ఆగష్టు 20 (globelmedianews.com)
 భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను కేరళకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, ఐటి రంగ ప్రముఖులు, వ్యాపార వాణిజ్య వేత్తలు, ఇతర రంగాల వారు ఇతోదిక సహాయం అందించడానికి ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు. సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కేరళ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతివైపరిత్యం వల్ల ప్రాణ, ఆస్థి నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ విపత్తు నుండి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తరఫున అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిఎం ప్రకటించారు.
 
 
 
తెలంగాణ తరఫున కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను సహాయం

No comments:
Write comments