సెప్టెంబర్ 4న పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు

 

ఇస్లామాబాద్, ఆగస్టు 18, (globelmedianews.com)
పాకిస్థాన్ అధ్యక్ష పదవి కోసం సెప్టెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పాక్ అధ్యక్షుడు మామూన్ హుస్సేన్ పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఆగస్టు 27 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ మెంబర్లు, ప్రావిన్సియల్ అసెంబ్లీ సభ్యులు కలిసి పరోక్ష పద్దతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు మామూన్ హుస్సేన్ 2013, సెప్టెంబర్‌లో పాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ నుంచి పోటీ చేసి అధ్యక్షుడిగా గెలుపొందారు హుస్సేన్. అయితే ఈ సారి పీఎంఎల్-ఎన్, పీటీఐ(పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్) పార్టీల మధ్య అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు.
 
 
 
సెప్టెంబర్ 4న పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు

No comments:
Write comments