వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి కేసీఆర్‌ను తరిమేయాలి మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌: ఉత్తమ్‌ మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షల ప్రమాద బీమా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపు

 

హైదరాబాద్ ఆగష్టు 14  (globelmedianews.com)
తాము అధికారంలోకి రాగానే ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్‌ ఇవ్వనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. రాహుల్‌ గాంధీ తొలుత రాజేంద్ర నగర్‌ క్లాసిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసిందన్నారు. తెరాస మంత్రి వర్గంలో ఒక్కరు కూడా మహిళ లేరని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు.తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ పాలనలో నాలుగున్నరేళ్లుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. 
 
 
 
వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి కేసీఆర్‌ను తరిమేయాలి 
మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌: ఉత్తమ్‌
మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షల ప్రమాద బీమా
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపు
 
కేబినేట్‌, శాసనమండలిలో ఒక్క మహిళా కూడా లేరని, మహిళా సంఘాలను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 6 లక్షల మహిళా సంఘాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి ద్వారా కేసీఆర్‌ను తరిమేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు లక్ష గ్రాంట్‌, ప్రమాద బీమాను 5 లక్షలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మహిళలు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ గాంధీ సమాధానమిచ్చారు. వీరికి సమన్వకర్తగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహరించారు.సంగారెడ్డి జిల్లాకు చెందిన మాధవి మాట్లాడుతూ... తెలంగాణ  ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోవడం లేదని, లోన్లు కూడా ఇవ్వడం లేదని. అభయహస్తం పథకం నిర్వీర్యం చేస్తుందని రాహుల్‌ దృష్టికి తీసుకొచ్చింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘రెండేళల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 15 మంది పారిశ్రామిక వేత్తలకు 2.5లక్షల కోట్లు రుణం మాఫీ చేసింది.  సామాన్యులకు చేసేందేం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద పారిశ్రామిక వేత్తలకే రుణాలు ఇస్తోంది. అధికారంలోకి వస్తే వడ్డీ భారం తమ ప్రభుత్వమే భరిస్తోంది. అభయ హస్తం స్కీమ్‌ను కూడా పునరుద్దరిస్తాం. ఇది మహిళల హక్కు. దేశం ముందుకు పోవాలంటే మహిళలు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని నా నమ్మకం. ఈ పని కాంగ్రెస్‌ పార్టీకి తెలుసు ఆ విధంగా ముందుకు పోతాం. మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.’ అని రాహుల్ పేర్కొన్నారు. మరో మహిళ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..  జీఎస్టీ అంటే తెలుసా అని ప్రశ్నించాడు. జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అని ప్రభుత్వం దోచుకునే విధానమని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామన్నారు.

No comments:
Write comments