ప్రజల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న వైద్యులు దేవునితో సమానం మాజీ గవర్నర్ కే.రోశయ్య

 

హైదరాబాద్, ఆగ‌స్టు 22 (globelmedianews.com)
వైద్య పరంగా ప్రజల్లో సామాజిక స్పృహ  కలిగించడం తో పాటు వైద్యో-నారాయణ హరి అన్న నానుడికి సార్ధకతను చే కూర్చుతూ ప్రజలకు వైద్య పరంగా సేవలన్దిసున్న వైద్యులు నిజంగా దేవుని తో సమానమని మాజీ గవర్నర్  కే.రోశయ్య అన్నారు.వైద్య వృత్తి పరంగా విశిష్ట సేవలందిస్తున్న ఉత్తమ డాక్టర్స్ గా గుర్తించిన 14 మంది డాక్టర్ లను రోశయ్య ఘనంగా సన్మానించారు.72 వ స్వతంత్ర దినోత్సవం పురస్క రించుకుని సుమన్ ఆర్ట్ థియేటర్ ఆద్వర్యం లో  నగరం లోని బిర్లా ప్లానిటోరియం ఆడిటోరియం లో జరిగిన పురస్కార మహోసత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కారాలను అందజేశారు.ఈ సందర్బంగా రోశయ్య  మాట్లాడుతూ వైద్య వృత్తి ని దైవంగా బావించి ఎల్లవేలలా తమ సమయాన్ని కేటాయించి సేవలందిస్తున్న డాక్టర్లను రోశయ్య అభినందించారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రాజ రెడ్డి, అతిదులుగా టిటిడి బోర్డ్ సబ్యులు రుద్రరాజు పద్మరాజు,తెలంగాణా ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఏ.పద్మా చారి తదితరులు పాల్గొని వైద్య వృత్తి పరంగా  డాక్టర్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు.ఈ సందర్బంగా డాక్టర్ నీరజ్,డాక్టర్ రజిత,డాక్టర్ సామ్యుల్ ,డాక్టర్ సౌజన్య ,డాక్టర్ రామ కృష్ణ ,డాక్టర్ సతీష్,డాక్టర్ శైలేంద్ర డాక్టర్ రవికిరణ్ లతో పాటు మరో ఆరిగురు  డాక్టర్స్ ను ఘనంగా సన్మానించారు.ప్రజల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న వైద్యులు దేవునితో సమానం
               మాజీ గవర్నర్  కే.రోశయ్య

No comments:
Write comments