అరవింద సమేత టీజర్ విడుదల

 

హైద్రాబాద్, ఆగస్టు 16 (globelmedianews.com) 
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర టీజర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తాజా టీజర్‌లో యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని చూపించారు. నెత్తుటితో తడిచిన కత్తి చేత పట్టి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. శత్రువుల్ని వెంటాడి చంపుతున్నారు. ‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? 
 
 
 
అరవింద సమేత టీజర్ విడుదల
 
అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్‌‌లో ప్రారంభమైన ఈ టీజర్ ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఉంది. కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తా’ అంటూ కుర్చీని గాల్లో గిరిగిరా తిప్పి మరీ కూర్చున్న యాక్షన్ సీన్ కాస్త ఓవర్‌గా ఉన్నా.. ఎన్టీఆర్ డైలాగ్‌ డెలివరీ వహ్ వా అనేలా ఉంది. ఇక టీజర్ చివర్లో సిక్స్ ప్యాక్‌లో శత్రువుల్ని వెంటాడుతూ సర్‌ప్రైజ్ చేశారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ నేపథ్యంలో విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ చిత్రాన్ని ‘అజ్ఞాతవాసి’ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా.. అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:
Write comments