రాహుల్ ఓయూలో నో

 

హైదరాబాద్, ఆగష్టు 11 (globelmedianews.com)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. భద్రతాపరమైన సమస్యలు వస్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాహుల్ సభ ఏర్పాట్లకోసం టీ. కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మొత్తంగా 17 విద్యార్థి సంఘాల మద్దతును కూడగట్టగలిగారు. ఇదే సమయంలో రాహుల్ సమావేశం కోసం ఠాగూర్ ఆడిటోరియం కావాలంటూ ఓయూ వైస్ చాన్సలర్‌కు టీ. కాంగ్రెస్ లేఖ రాసింది. అయితే ఈ విన్నపాన్ని తిరస్కరిస్తున్నట్లు వీసీ ప్రకటించారు.
 
 
 
రాహుల్ ఓయూలో నో
 
లంగాణలో ఈ నెల 13,14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీ లో పర్యటిస్తారని, ఓ సదస్సు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి లభించలేదు. ఇందుకు వర్శిటీ వీసీ నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సు నిర్వహణకు అనుమతి నిరాకరించారు. 
మరో వైపు విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించనున్నాయని తెలుస్తోంది. కాగా, రాహుల్ ని యూనివర్శిటీలోకి అడుగుపెట్టనివ్వమని కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. రాహుల్ ని యూనివర్శిటీలో అడుగుపెట్టనివ్వకుండా చూడాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రాలు కూడా సమర్పించారు.
అయితే ఓయూలో రాహుల్‌ను అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ హెచ్చరించింది. తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానాలు చేసుకున్నప్పుడు కన్నెత్తి చూడని రాహుల్... ఇప్పుడు రాజకీయాలకోసం ఓయూకు వస్తామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించింది. టీఆర్ఎస్వీ ప్రకటనపై ప్రత్యర్థి వర్గం విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఎవరైనా ఎక్కడైనా పర్యటించే హక్కుందని అన్నారు. రాహుల్ రాకను రాజకీయం చేయవద్దని సూచించారు. రాహుల్‌ను అడ్డుకుంటామంటూ టీఆర్ఎస్వీ నేతలు చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

No comments:
Write comments