దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కడియం

 

వరంగల్ ఆగష్టు 15 (globelmedianews.com)
దివ్యాంగులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. వారి సంక్షేమాభివృద్ధి కోసం రూ.100కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ రూ.500 నుంచి రూ.1500కు పెంచామని పేర్కొన్నారు. వారి కోసం వందశాతం రాయితీ రుణాలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయ‌మ‌ని వివ‌రించారు.
 
 
 
దివ్యాంగులకు  ప్రభుత్వం అండగా ఉంటుంది: కడియం

No comments:
Write comments