ఇద్దరి కంటే నేనే బెటర్

 

ఏలూరు, ఆగస్టు 14, (globelmedianews.com) 
ఇద్దరికీ ప్రత్యామ్నాయం తానేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకుంటూ వెళుతున్నారు. అధికారంలో ఉన్న నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎంతో బెటరని, వచ్చే ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పదే పదే చెబుతున్నారు. రెండు పార్టీల మీద విమర్శల దాడిని పెంచేశారు. ఇద్దరూ అవినీతి పరులే అంటూ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
 
 
 
ఇద్దరి కంటే నేనే బెటర్
 
అలాగే పవన్ తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు కూడా సమాధానం ఇస్తూ వెళుతున్నారు. కార్లు మార్చినట్లు పవన్ కల్యాణ‌ భార్యలను మారుస్తారంటూ ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లకు ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. తాను బలాదూర్ గా తిరగలేనని, పొగరెక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కాలం కలసిరాకనే అలా జరిగిందని నిర్వేదంగా మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.జగన్ ప్రజాసమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అటువంటి ప్రతిపక్షానికి అధికారం కట్టబెడతారా? అని పవన్ ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు, లోకేష్ లపై కూడా పవన్ కల్యాణ్ విరుచుకు పడ్డారు. లోకేష్ దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని, అటువంటి ఆటలను జనసేన సాగనివ్వబోదని అన్నారు. కులాల మధ్య రిజర్వేషన్ల పేరిట చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆ ప్రయత్నాన్ని తాను అడ్డుకుంటానని అన్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ ప్రీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.

No comments:
Write comments