చదువుకుంటేనే అభివృద్ధి

 

ఒంగోలు, ఆగస్టు 8  (globelmedianews.com)    
కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ రావడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చదువుకున్న విద్యార్థుల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తెచ్చామన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ యూనివర్శిటీలను ఏపీకి తీసుకొస్తామని, మంజూరు చేసిన 11వర్సిటీల పూర్తికి కేంద్రంపై పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తరగతి గదులకే విద్యార్థుల చదువు పరిమితం కాకూడదన్నారు. ప్రతి విషయాన్ని పరిశోధనాత్మక విధానంతో ముందుకు వెళ్లాలని, సెల్‌ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే రోజులు రానున్నాయని ఆయన అన్నారు. 
 
 
 
చదువుకుంటేనే అభివృద్ధి
 
ఏపీ ఇన్నొవేషన్ వ్యాలీగా మారనుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పామూరు మండలం దూబగుంటలో ఆయన ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసి.. పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పామూరు, కనిగిరి వంటి వెనుకబడిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో.. జిల్లాలో మైనింగ్, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్శిటీలతో పాటు .. ఒంగోలులో నేషనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న విద్యార్థుల వల్ల కనిగిరి వంటి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగతాయని..హైదరాబాద్ కంటే గొప్పగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి ప్రపంచంలోనే ది బెస్ట్ యూనివర్శిటీలను తీసుకొస్తామని.. కేంద్ర నుంచి మంజూరైన 11వర్సిటీలను పూర్తి చేసేందుకు అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇన్నొవేషన్ వ్యాలీగా మారుతుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు చంద్రబాబు. జిల్లాల్లోని సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు సీఎం. ఇకపై ప్రతి నెలా వెలుగొండకు వచ్చి.. ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానన్నారు. రూ.37 కోట్లు కేటాయించి డెయిరీలో సమస్యలు పరిష్కరించానని, నిమ్జ్, దొనకొండ మెగా ఇండస్ట్రియల్‌ హబ్ వస్తే జిల్లాలోని యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే జిల్లాలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు చంద్రబాబు.  గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి తీసుకొస్తామన్నారు. జిల్లాలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రులు, టీడీపీ నేతలు, పలువురు అధికారులు ఉన్నారు.

No comments:
Write comments