వీసీలతో గవర్నర్ భేటీ

 

హైద్రాబాద్, ఆగస్టు 8  (globelmedianews.com)    
తెలంగాణ లో ఉన్నా అన్ని యూనివర్సిటీల వీసీ లతో గవర్నర్ భేటీ కానున్నారు...గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఫై సమీక్షించబోతున్నారు..వీసీ లతో సమావేశం అయిన ఉన్నత విద్యామండలి గవర్నర్ కు ఏమి చెప్పాలనే దానిపై చర్చించింది... అయితే గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో వైస్ చాన్సలర్లు చాలా అంశాలను అమలు చేస్తున్నారా..లేదన్న దానిపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వీసీలలో నెలకొంది... గతంలో చెప్పినా అంశాల పై సీరియస్ గానే క్లాస్ తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.యూనివర్సిటీ విసి లతో గవర్నర్ నరసింహన్ ఈ నెల 8న వైస్ ఛాన్స్లర్ లతో సమావేశం కానున్నారు... గత సమావేశం నుండి ఇప్పటివరకు జరిగిన పనులు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుపై సమీక్షించనున్నారు. దీంతోపాటు భవిష్యత్ లో ఏమి చేయాలో మార్గనిర్దేశం చేయనున్నారు... 
 
 
 
వీసీలతో గవర్నర్ భేటీ
 
అయితే గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో గవర్నర్ వైస్ ఛాన్స్లర్ లకు టార్గెట్ ఇచ్చారు.వచ్చే సమావేశం నాటికీ పూర్తి చేయాలని ఆదేశించారు..అయితే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీసీ లు పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు చేసిన పాపాన పోలేదు. డిప్యూటీ సీఎం పలుమార్లు సమావేశం పెట్టి వీసీ లను మందలించిన పెద్దగా మార్పు లేదు... మళ్ళీ 8న గవర్నర్ వారితో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి వీసీ లతో సన్నహక సమావేశం అయింది... ఇప్పటి వరకు చేసిన పనులఫై సమీక్షించింది... చేయని వాటి ఫై ఎందుకో చేయలేదో చర్చించారు ఉన్నత విద్యా మండలి అధికారులు. గవర్నర్ కి ఏమి చెప్పాలో రిపోర్ట్ ఎలా ఇవ్వాలో నిర్ణయించారుచేయక పోవడానికి గల కారణాలు ఏంటో వివరించాలని డిసైడ్ అయ్యారు

.గత సమావేశం లో ఆదేశించిన దాంట్లో ప్రధానంగా కామన్ అకడమిక్ క్యాలెండర్ ను ఫాలో కావడం.యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలో బయోమెట్రిక్ విధానాన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.యూనివర్సిటీలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని సూచించారు.బడ్జెట్ ని మౌలిక వసతుల కల్పనకీ ఖర్చుచేయాలని చెప్పారు. పి.హెచ్.డి అడ్మిషన్ల లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని... యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ లను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు.హాస్టల్స్ లో ఉంటున్న అవుట్ సైడర్ లపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు..
అయితే ఇందులో చాలా అంశాలు ఉపకులపతులు పట్టించుకోలేదని చెప్పొచ్చు వీటిని అమలు చేయాలనే విషయంలో శ్రద్ధ కూడా పెట్టినట్టు లేదు ...గవర్నర్  తో జరిగే సమావేశం అందరిని క్లాస్ పికితారు అనే చర్చలు జరుగుతున్నవి...మరి రేపు గవర్నర్ వీసి లకు ఏ విధంగా దిశ నిర్దేశం చేస్తారో వేచి చూడాలి..

No comments:
Write comments