మాకు జవాబివ్విండి : రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, ఆగష్టు 28 (globelmedianews.com)
మొన్న కేసీఆర్ కు కొన్ని ప్రశ్నలు వేసాం. మేము లేవనెత్తిన అంశాలకు  మాకోసం కాకపోయినా ప్రజల కోసం సమాధానం చెప్తారనుకున్నాం. సీఎం కుమారుడు కేటీఆర్  ముందస్తు ఎన్నికలు టీఆకురావడం వల్ల ఎవరికి లాభం. మీ బాస్ లు ప్రజలే అయితే.. వారు 5 ఏండ్ల కోసం  ఓట్లేశారు.. మరి 4 సంవత్సరాల 4 నెలలకే ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నారో  వారికే సమాధానం చెప్పండని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. 133 ఏండ్ల కాంగ్రెస్ ఎన్ని ఎన్నికలను చూసి ఉంటది.  మాకేం భయం... ఇది మీ అవగాహనా రహిత్యమా?  ప్రతిపక్షంగా..ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి  మేం అడుగుతున్నాం. మీరు భయపడి ముందస్తుకు పోతున్నారు కాబట్టి.. మేము అడుగుతున్నామని అయన అన్నారు. జనవరి 4 , 2019 కల్లా కొత్త ఓటర్ లిస్ట్ పెట్టమన్నారు. ముందస్తు జరగాలంటే ఎన్నికల సంఘం ఇచ్చిన కార్యాచరణ మొత్తం పక్కన పెట్టి.. పాత లిస్ట్ తో ఎన్నికలకు వెళ్ళాలి. 
 
 
 
మాకు జవాబివ్విండి : రేవంత్ రెడ్డి 
 
ఆ అవసరం ఏమిటని అయన ప్రశ్నించారు. ఈ ఆదేశాలను పక్కన పెట్టి ముందస్తు కోసం మోడీ ముందు మొకరిల్లుతున్నాడు కేసీఆర్. విభజన హామీల కోసం కేసీఆర్ ఎన్నడూ కేంద్ర మంత్రులను,  పీఎం ల ను కలవలేదు. కానీ కేటీఆర్, కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వంగి, వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. వాళ్ళ సర్వే లలలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఎక్కడా ఎమ్మెల్యే గా కూడా గెలుస్తారని రాలేదు..అందుకే ముందస్తు. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి ఆటంకం అన్నారు బీజేపీ, తెరాస. నేతలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న బీజేపీ.. ఎందుకు తెలంగాణా లో ముందస్తు కు సహకరిస్తున్నారో సమాధానం చెప్పాలని అయన అన్నారు. 89 లో ఎన్టీఆర్, 2004 లో చంద్రబాబు కు ముందస్తు ఫలితాలు ఎలా వచ్చాయో.. కేసీఆర్ పరిస్థితి కూడా అంతే.  ఒక్కసారి ఎన్నికలు నెగ్గితే ఇంత అహంభావం అవసరమా.  కొంగర ఖలాన్ లో ప్రగతి నివేదన సభ కు 25 లక్షల మంది సభ పెడితే.. 500 కోట్లు ఖర్చు అవుతాయి.. వాటి వివరాలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేసారు. తెలంగాణ భవన్ లో మీ ఎమ్మెల్యే ల కు ఇచ్చిన కోటి రూపాయల డబ్బా ఇచ్చారు. మీ ఎమ్మెల్యే లు ఎగబడి మీరిచ్చిన డబ్బాలు తీసుకున్నారు. వారికి కోటి రూపాయలు ఇచ్చారు, ఇది మీ ఎంపీ సంతోష్ రావు చేశారు.. మాకు పక్కా సమాచారమని అయన అన్నారు. కేటీఆర్ .. నువ్ అమెరికాలో బాత్రూమ్ లు కడుక్కున్నప్పుడే నేను ఎన్నికలు పోటీ చేసినా.  అప్పుడు మీ నాయిన చేసిన రాచ కార్యాలు దగ్గర నుండి చూసినా. ఎన్నికల సామగ్రి డబ్బాల్లో ఇవ్వరు గొనె సంచీలలలో ఇస్తారని అన్నారు. కేటీఆర్ సభ కి ఇంచార్జి కాబట్టి సమాధానం చెప్పాలి.. మీరు ఎమ్మెల్యే ల కి ఇచ్చిన డబ్బా అలా లో ఎంత సామాగ్రి పడుతదో చూపించండి. సభకు కేసీఆర్ ఆవేదన సభ అని పెట్టుకోండి.. బాగుంటదని అన్నారు. కేటీఆర్ ను సీఎం చెయ్యలనుకుంటున్నావ్.. కానీ గాడిదకు కళ్లెం కడితే గుర్రం కాదు.. అది కేసీఆర్ కు తెలుసు. ఈ శాఖ ఇచ్చినా కూడా అసమర్థుడుగా ముద్ర వేసి మీరే మార్చారు కేసీఆర్.. మీకే దినాలు దగ్గర పడ్డాయి..మీ కొడుకెంత అని అన్నారు. నా మీద పెట్టిన కేసుల మీద కోర్టులు తీర్పుఇచ్చాయి. సిరిసిల్ల లో నువ్వు నేను చెరొక దిక్కు నుండి వస్తే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దామని అన్నారు. వన్ సీఆర్ టు టెన్ సీఆర్ కేటీఆర్, టెన్ సీఆర్ టు ఆ పైన సీఆర్ కేసీఆర్ అని జనం అనుకుంటున్నారు. పొత్తుల మీద పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెబుతారు. లక్ష్మణ్ కూడా రాహుల్ గాంధీ పీఎం కావాలని కోరుకోవడం మంచి పరిణామం. కేసీఆర్ రహస్య మిత్రుడు అయిన లక్ష్మణ్ మా మేలు కోరుకుంటారా? రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదు కాబట్టి.. వారి రహస్య మిత్రుడు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాడని అయన వ్యాఖ్యానించారు.

No comments:
Write comments