తెలంగాణలో చీలక ఓట్ల కోసం జనసేన ఎత్తుగడ

 

హైద్రాబాద్,ఆగస్టు 8, (globelmedianews.com) 
వినేందుకు బాగానే ఉన్నా ఎక్క‌డా లాజిక్‌కు అంద‌ట్లేదు క‌దూ! అందుకే దాన్ని రాజ‌కీయం అంటారు. మెజీషియ‌న్ లు కూడా చేయ‌ని మేజిక్‌లు చేయ‌గ‌ల స‌త్తా రాజ‌కీయ నేత‌ల సొంతం. తెలంగాణ‌లో బీజేపీను తిట్టిపోసే గులాబీద‌ళం.. కేంద్రంలో మాత్రం మోడీ జ‌పం చేయ‌ట్లేదు. టీడీపీ అంటే ఆమ‌డ‌దూరంలో ఉండే కాంగ్రెస్ ఇప్పుడు పొత్తుకోసం వెంప‌ర్లాడ‌టం లేదు. అలాగే. కేసీఆర్‌కు ఎవ‌రు  ఎప్పుడు ఎలా స‌పోర్టు చేశార‌నేది కూడా. 2014లో తెలంగాణ‌లో కాంగ్రెస్ చేతులారా ఓట‌మిని కొనితెచ్చుకుంది. అటు ఏపీ వాళ్లు పూర్తిగా ఛీ కొడితే.. తెలంగాణ‌లో స‌గం ఛీద‌రించుకున్నారు. అందుకే.. ప్ర‌తిప‌క్షంగా అయినా.. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు అవ‌కాశం చిక్కింది. పాపం..ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదాయె. కేసీఆర్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడుకు బ‌ద్ద వ్య‌తిరేకి. 
 
 
 
తెలంగాణలో చీలక ఓట్ల కోసం జనసేన ఎత్తుగడ
 
చంద్ర‌బాబుకు జ‌గ‌న్ బ‌ద్ద‌శ‌త్రువు. ఈ లెక్క‌న‌.. ఇద్ద‌రికీ కామ‌న్ శ‌త్రువు చంద్ర‌బాబు కావ‌టంతో.. జ‌గ‌న్‌తో కేసీఆర్ మైత్రి కొన‌సాగింది. ఆనాటి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపు ప‌క్కా అంటూ కేసీఆర్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అయితే చంద్ర‌బాబు వ్యూహ‌మో..  ప‌వ‌న్ మంత్ర‌మో.. బీజేపీ ఉంద‌నే ధైర్య‌మో జ‌నం.. బాబుకు సీఎం సీటు అప్ప‌గించారు. ఇదే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కేసీఆర్ ఒక్క‌డే.. స‌మ‌ర్థంగా కాంగ్రెస్‌ను, టీడీపీను ఎదిరించాడ‌నుకుంటే పొర‌పాటే. ఎందుకంటే.. టీడీపీ ఓట్లు అలాగే ఉన్నాయి. కాబ‌ట్టే కొంద‌రు ఎమ్మెల్యేలు నెగ్గారు. అదే కాంగ్రెస్ మ‌రిన్నిసీట్లు సాధించే.. అవ‌కాశాన్ని.. అడ్డంగా దెబ్బ‌తీసింది మాత్రం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అనేది నాటి రాజ‌కీయ విశ్లేష‌కులు లెక్క‌గ‌ట్టారు. అదెలా అంటారా.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా తెలంగాణాలో పోటీచేసింది. నాలుగు సీట్లు కూడా గెలుచుకున్నారు. మిగిలిన 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల‌ను చీల్చ‌టం ద్వారా.. ప‌రోక్షంగా టీఆర్ ఎస్ గెలుపున‌కు స‌హ‌క‌రించింది. ఇలా.. ఓట్ల చీలిక ఒప్పందంతో జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ రాజీప‌డ్డార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఎందుకంటే.. ఇద్ద‌రూ సీఎంలు అయితే.. సాఫీగా ప్ర‌యాణం సాగించ‌వ‌చ్చ‌నే ఒప్పందం కూడా.
అయితే.. అనుకున్న‌దంతా.. తెలంగాణ‌లో ఓకే అయినా..ఏపీలో బెడ‌సికొట్టింది. ఇప్పుడు అవ‌న్నీజ‌నానికి తెలిశాయి. కాబట్టి కొత్త ఎత్తుగ‌డ‌కు శ్రీకారం చుట్టారు కేసీఆర్.దానిలో భాగ‌మే.. 2019లో జ‌గ‌న్ స్థానంలో ప‌వ‌న్ గులాబీ నేత‌కు సాయం చేయాల్సి ఉంటుంది. హ‌స్తం, టీడీపీ ఓట్ల‌ను చీల్చేలా.. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను పోటీకి దింపాల‌.. అనేది ఒప్పంద‌మ‌ట‌. అయితే ఇదంతా కేవ‌లం విశ్లేష‌కుల  లెక్క‌లు మాత్ర‌మే. ఇటీవ‌ల కేసీఆర్‌ను క‌ల‌సిన ప‌వ‌న్ ఇదే అంశంపై మాట్టాడ‌నేది కూడా ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌రిగితే.. ఎలాగూ..ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీకాబ‌ట్టి.. వీలునుబ‌ట్టి. ఏపీలో సాయం చేసేందుకూ కేసీఆర్ రెడీ అనొచ్చ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. ఇది రాజ‌కీయం..ఊహించిన‌దే జ‌ర‌గొచ్చు. ఊహ‌కంద‌ని విధంగా వ్యూహాలూ మార్చ‌నూ వ‌చ్చు.

No comments:
Write comments