కలెక్షన్లు కురిపిస్తున్న గీతా గోవిందం

 

ఆగస్టు 27, (globelmedianews.com)
12 రోజుల్లో వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన సినిమాగా గీతగోవిందం కొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఒక స్మాల్ రేంజ్ బడ్జెట్ సినిమా ఈ తరహా ఫీట్ సాధించిన దాఖలాలు తెలుగునాట ఇంతకు ముందు లేనేలేవు. 14 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ‘గీతగోవిందం’ ఇప్పుడు వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అది కూడా మొత్తం 12 రోజుల రన్తో ఈ సినిమా ఈ వసూళ్లను సాధించింది. ఇది మరి కొన్ని రోజులు థియేటర్లలో కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో ఈ సినిమా వసూళ్లు మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది. గ్రాస్ వసూళ్ల విషయంలో ఈ సినిమా వంద కోట్ల రూపాయల మార్కును అందుకుంది. అదే షేర్ విషయానికి వస్తే.. ఇది రూ.52 కోట్ల రూపాయల మార్కును అందుకుంది. ఈ సినిమా షేర్ వసూళ్లు.. ప్రాంతాల వారీగా చూస్తే... 
నైజాం - రూ.15.45 కోట్లు, సీడెడ్ -రూ.5.10 కోట్లు, నెల్లూరు -రూ.1.09 కోట్లు , గుంటూరు -రూ.3.5 కోట్లు , కృష్ణా -రూ.2.98 కోట్లు, ఈస్ట్ గోదావరి- రూ.2.45 కోట్లు, వెస్ట్ గోదావరి -రూ.2.97 కోట్లు, వైజాగ్ -రూ.4.72 కోట్లు, బెంగళూరు -రూ.3.48 కోట్లు, చెన్నై - రూ.1.72 కోట్లు, రెస్టాఫ్ ఇండియా -రూ.1.29 కోట్లు, ఓవర్సీస్ - రూ. 7 కోట్లు కలెక్షన్లు కురిపిస్తున్న గీతా గోవిందం

No comments:
Write comments