ఆరవై శాతం ఐటీ కంపనీలు విశాఖలోనే

 

విశాఖపట్నం,,ఆగష్టు 11 (globelmedianews.com)
ఏపీకి వస్తున్న ఐటీ కంపెనీల్లో 60 శాతం విశాఖపట్టణంలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. 2024 నాటికి ఏపీలో నిరుద్యోగులు ఉండరని ఆయన అన్నారు. 2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 
 
ఆరవై శాతం ఐటీ కంపనీలు విశాఖలోనే
 
ఏపీలో నిరుద్యోగులందరికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో కొత్తగా ఏర్పాటైన 13 ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తర్వాత కాపులపాడు ఐటీ పార్క్‌పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కంపెనీల్లో సీఈఎస్‌ లిమిటెడ్, సెరియం సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటి, సహస్రమయ టెక్నాలజీస్, వెలాంటా కేపీఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సింబయోసిస్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, పాత్రా ఇండియా బీసీఓ సర్వీసెస్ ఉన్నాయి. ఈ కంపెనీలతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మంత్రి లోకేష్. నూటికి నూరుశాతం ఉద్యోగాలు కల్పించి.. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. ఏపీ రాజధాని అమరావతితో పాటూ మిగిలిన జిల్లాలకు ఐటీని విస్తరిస్తామన్నారు మంత్రి. విశాఖకు రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయన్నారు. 2024నాటికి రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాన్ని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తున్న కంపెనీలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

No comments:
Write comments