చిత్తూరులో మారుతున్న రాజకీయం కిరణ్ వర్సెస్ కిషోర్

 

తిరుపతి, ఆగస్టు 22,(globelmedianews.com) 
2019 ఎన్నికలకు ముందే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం, ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట అప్పుడే సవాళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన తర్వాత ‘జై సమైక్యాంధ్రపార్టీ’ పెట్టి కిరణ్ రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారు.రానున్న ఎన్నికల్లో ఎలాగో... టీడీపీ-కాంగ్రెస్ పార్టీ ఒక్కటవుతాయనే ఒక్క డీల్‌తోనే ఈ వ్యవహారమంతా జరిగిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే కిశోర్ రెడ్డి.. పై వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. మొత్తానికి చూస్తే నల్లారి కేడర్‌లో మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అయితే కిరణ్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీకి ఇప్పుడున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో దాదాపు పోటీ చేయడనే విశ్లేషకులు చెబుతున్నారు. 
 
 
 
చిత్తూరులో మారుతున్న రాజకీయం
కిరణ్ వర్సెస్ కిషోర్
 
ఆ తర్వాత అదికాస్త బెడిసికొట్టడం.. అడ్రస్‌లేకుండా ఆయన ఇంటికే పరిమితమై వ్యాపారాలు చూసుకుంటూ సుమారు కొన్నేళ్లపాటు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ఆయన సేవలు గుర్తించిన కాంగ్రెస్ మళ్లీ పార్టీలోకి చేర్చుకుంది.. త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉంది. అంతేకాదు వీలైతే కిరణ్ అడ్డగా పేరుగాంచిన పీలేరు నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం యోచిస్తోంది.ఈ తరుణంలో.. కిరణ్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న టైంలోనే తమ్ముడు కిశోర్ రెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. ఏకంగా మాజీ సీఎం తమ్ముడే పార్టీలోకి రావడంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి సీఎం సంతోషపెట్టారు. రానున్న ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దింపాలని టీడీపీ కీలక నిర్ణయమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అటు అన్న కాంగ్రెస్‌లో.. ఇటు తమ్ముడు టీడీపీలో ఒకే ఇంట్లో రెండు కుంపట్లు పెట్టినట్లుగా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. చేరో గూటికి చేరుకున్నారు.. అక్కడికి వరకూ ఓకే అయితే రానున్న ఎన్నికల్లో ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? ఎవరికి టికెట్ ఇస్తారు..? ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు పీలేరు నియోజకవర్గ ప్రజల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న. కిరణ్ రెడ్డి కేడర్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన పార్టీకి ఇన్ని రోజుల పాటూ దూరంగా ఉన్నప్పటికీ అప్పటికి ఇప్పటికీ కేడర్ మాత్రం చెక్కుచెదర్లేదని కిరణ్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటుంటారు. అయితే తాజాగా.. కిశోర్ రెడ్డి చేసిన సంచలన ప్రకటనతో ‘నల్లారి’ అనుచరులు, కేడర్ అయోమయంలో పడింది. రానున్న ఎన్నికల్లో కిరణ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మీ పరిస్థితేంటి..?  మీరు టీడీపీ తరఫున బరిలోకి దిగుతారా? లేకుంటే తప్పుకుంటారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఆశ్చర్యపోయే సమాధానమిచ్చారు. "ఎవరు పోటీలో ఉన్నా సరే.. ఐ డోంట్ కేర్.. నేను మాత్రం పోటీ చేసి తీరుతానంతే. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని కిశోర్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ ప్రకనతో నల్లారి అనుచరగణం తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. పోయి పోయి సొంత అన్నపైన ఇలా ఇష్టానుసారం మాట్లాడుతూ అది కూడా మీడియా ముందు మాట్లాడితే ఎలా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలు సొంత అన్న పైన మీకుండే గౌరవం ఇదేనా..? తమరికి అన్నీ తానై అండగా ఉన్న అన్నపైనే పోటీ చేసేంత దమ్ము మీకుందా..? అసలు మీరు ఈ ప్రకటన చేసి ఉండకూడదు కిశోర్..? అంటూ ఒకింత నల్లారి అనుచరులు, కిరణ్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కిరణ్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కిశోర్ రెడ్డి ఓ వెలుగు వెలిగారు.. రానున్న ఎన్నికల్లో పీలేరు నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని.. తనకే టికెట్ ఇవ్వాలనే ఓ కండిషన్‌తోనే కిశోర్ రెడ్డి తెలుగుదేశం కండువా కప్పుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో ఇవన్నీ నిజమేనని.. రుజువయ్యాయి. ఇక ఇవన్నీ అటుంచితే కాంగ్రెస్ అధిష్ఠానం సలహాతోనే కిశోర్‌ను అన్నే దగ్గరుండి టీడీపీలో చేర్చారని . ఒక వేళ పోటీ చేస్తే ఆ సంగతి పెరుమాళ్లకే ఎరుక.! కాగా.. తమ్ముడి వ్యాఖ్యలపై కిరణ్ ఎలా స్పందిస్తారో..? ఏంటో తెలియాలంటే కొద్దిరోజుల పాటు వేచి చూడాల్సిందే మరి.

No comments:
Write comments