ఇవాళ తిరుపతి లో చంద్రబాబు పర్యటన

 

తిరుపతి, ఆగస్టు 29, (globelmedianews.com)
దేశంలోనే తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ ఇంటి నంబర్లను ప్రారంభించనున్నారు. ఎవరికైనా చిరునామా చెప్పాల్సిన సమయంలో ఈ క్యూఆర్‌ కోడ్‌ను పంపితేచాలని.. స్మార్ట్‌ఫోన్‌లో ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ చిరునామాకు గూగుల్‌ మ్యాప్‌ మార్గాన్ని చూపుతుందని.. త్రీడీ ఇమేజ్‌తో మరొకరి సాయం లేకుండా నేరుగా అవసరమైన చిరునామాకు చేరుకోవచ్చని వివరించారు. ఇదో విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని.. టెక్నాలజీ ఉపయోగించుకుని తిరుపతిలో ప్రతి ఇంటింటికి డిజిటల్‌ ఇంటి నంబర్ల కేటాయించే ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తిచేశామని చెప్పారు. 
 
 
 
ఇవాళ తిరుపతి లో చంద్రబాబు పర్యటన
 
ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఈ క్యూఆర్‌ కోడ్‌లో కూడిన డిజిటల్‌ ఇంటి నంబర్లను ప్రారంభిస్తారన్నారు. తిరుపతిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్‌ ఇంటి నంబర్లు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు గురువారం ఉదయం తిరుపతికి చేరుకుని.. మొదటగా అన్న క్యాంటీన్‌ను, అనంతరం డిజిటల్‌ ఇంటి నంబర్లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఇక్కడ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌.ఎన్‌.టాటాతో కలసి పాల్గొంటారన్నారు. తితిదే, టాటా ట్రస్ట్‌ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ అనుమతితో భూమి కేటాయించామన్నారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో క్యాన్సర్‌ పరిశోధన, వైద్య చికిత్సలను ఇక్కడ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 300 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్న ఈ రీసెర్చ్‌ సెంటర్‌ వైద్యపరంగా జిల్లాకు ఎంతో ప్రత్యేకత తీసుకొస్తుందన్నారు. ప్రస్తుతం మానవుల జీవనవిధానాలు, ఆహారపు అలవాట్లు మారిపోయిన పరిస్థితుల్లో రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయని.. వీటిని తొలిదశలో గుర్తిస్తే సరైన వైద్యచికిత్సల ద్వారా నయం చేసే అవకాశం ఉందన్నారు. తొలిదశలో దీన్ని గుర్తించే వైద్య పరీక్షలు అందుబాటులో లేక.. చివరిదశలో గుర్తిస్తున్నారన్నారు. వ్యాధి నుంచి రక్షించుకోలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో అత్యాధునికమైన క్యాన్సర్‌ పరిశోధన, చికిత్స అందుబాటులోకి రానుండటం శుభపరిణా మమన్నారు. ఇక్కడే సుమారు 10వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని.. రూ.350కోట్ల మేర లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆస్తులను పంపిణీ చేయనున్నామని చెప్పారు.

No comments:
Write comments