ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో దళిత సంఘాల సింహగర్జన

 

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (globelmedianews.com)
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని కోరుతూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో దళిత సంఘాలు నాలుగు రోజులపాటు సింహ గర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించాయి.  ర్యాలీ చివరి రోజున ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సహా ఇతర పార్టీల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను మోడీ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరి వల్ల కోల్పోయే ప్రమాదంలో పడ్డామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అయన ఆరోపించారు. 
 
 
 
ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో దళిత సంఘాల సింహగర్జన
 
దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఏకమౌతున్న సమయంలో కేంద్రం దిగివచ్చి పార్లమెంటులో చట్టం చేసినప్పటికీ ఆ చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చినప్పుడే దళిత హక్కులకు భద్రత ఉంటుందని దళిత సంఘాలుఅభిప్రాయపడ్డారు. ఆ బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకోవాలని  దళిత సంఘాల నేతలుకోరారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ దళితులకు భూపంపకాలు, అట్రాసిటీ వ్యతిరేక చట్టాలు కాంగ్రెస్ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల వల్లే జరిగిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితుల హక్కులను కాపాడే చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని అయన  మండిపడ్డారు. అట్రాసిటీ చట్టాన్ని బలహీన పరిచే తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి పదోన్నతి కల్పించి దళిత వ్యతిరేకతను చాటుకున్నారని విమర్శించారు. త్వరలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, రైతుల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.

No comments:
Write comments