సైరా లో గొనా గోనరెడ్డి

 

హైద్రాబాద్, ఆగస్గు 9, (globelmedianews.com) 
మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త నెట్‌లో హల్ చల్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘సైరా’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో మెగా న్యూస్ చక్కర్లు కొడుతుంది. సుధీర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రూపొందుతోంది. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీలో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 2017 డిసెంబర్2లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు.. 
 
 
 
సైరా లో గొనా గోనరెడ్డి
 
విజయ్ సేతుపతి, సుధీప్, జగపతిబాబు లాంటి స్టార్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవితో నయనతార జోడీ కడుతోంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌కూడా గెస్ట్ పాత్రల్లో మెరవనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పవర్ క్యాస్టింగ్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన ‘సైరా’ మూవీలో అల్లు అర్జున్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారట. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ మూవీలో గోన గన్నారెడ్డి తరహా పాత్రలో అల్లు అర్జున్ కత్తి తిప్పేందుకు రెడీ అవుతున్నారట. రుద్రమదేవి లాంటి హిస్టారికల్ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రలో ‘గమ్మునుండవోయ్’ అంటూ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. గోన గన్నారెడ్డి లాంటి పవర్ ఫుల్ పాత్రలో చక్కగా ఒదిగిపోయిన అల్లు అర్జున్.. మెగాస్టార్ ‘సైరా’ లో ఈ తరహా పాత్ర చేస్తున్నారంటే ఇది మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం తరువాత ఏ సినిమాకి ఓకే చెప్పకుండా ఉండిపోవడంతో ఆయన ‘సైరా’లో నటిస్తున్నారనడానికి బలాన్ని చేకూర్చేలా ఉంది. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

No comments:
Write comments