రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంబించిన హరీష్ రావు

 

సిద్దిపేట ఆగష్టు 24 (globelmedianews.com)
కొండపాక వేద స్కూల్ మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డీ అని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఆడగలిగే క్రీడ ఒక్క కబడ్డీ మాత్రమే అని చెప్పారు. ఇటీవల కబడ్డీ క్రీడకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగిందన్నారు. కబడ్డీ క్రీడకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి క్రీడాకారులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.
 
 
 
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంబించిన హరీష్ రావు

No comments:
Write comments