బీసీ ల రాజకీయ చైతన్య బస్సు యాత్ర

 

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 18 (globelmedianews.com)
పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీ ల వాటా బీసీ లకే దక్కాలని పాలమూరు నుండి పట్నం వరకు చేపట్టిన బీసీ ల రాజకీయ చైతన్య బస్సు యాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా బస్సు జాతా లో  స్దానిక మిల్క్ సెంటర్ నుండి బస్ స్టేషను వరకు బీసీ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కి వివిధ పార్టీ ల నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం బస్ స్టేషను వద్ద గల మహత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి బీసీ సంఘం రాష్ట్ర అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పూల మాలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీ ల వాటా బీసీ లకే దక్కాలని 36 రోజుల పాటు ఎనభై నియోజకవర్గాల్లో బీసీల రాజకీయ చైతన్య బస్సుయాత్ర చేపట్టామని చెప్పారు. పేరుకు బీసీలకు 56 శాతం అని చెప్పి రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం శూన్యమని అన్నారు. తరతరాలుగా అగ్రవర్ణాల పాలన లో బీసీలు అట్టడుగున పడుతున్నారే తప్ప చైతన్యం లేదన్నారు. అందుకే బీసీ ల చైతన్యం కొరకు బస్సు యాత్ర ను ప్రారంభించామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలను అణగదొక్కిన పాలకులు ఇప్పుడు పోరాడి సాదించుకున్న తెలంగాణ రాష్ట్రం లొ కూడా అలాగే ఉందని నల్లగొండ జిల్లా రెడ్ల కొండ కాదని బడుగు వర్గాల అండ అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో పార్టీ లకు అతీతంగా ఏకమై బీసీ ల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇప్పడు కాకపోతే ఇంకెప్పుడు.. నీవు కాకపోతే ఇంకెవ్వరూ అంటూ బీసీ లు అందరూ ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని రాజకీయాలలో బీసీల ను గెలుపుకొరకు కృషిచేయాలని సూచించారు. ఈ బస్సు జాత లో బీసీ నాయకులు పేరపు రాములు ,ఇల్లందుల మల్లేష్ ,బీర్ల అయిలయ్య ,వస్పరి శంకరయ్య ,ముదిగొండ శ్రీకాంత్ ఆలేరు మండల బీసీ సంఘం నాయకులు జూకంటి స్వామి ,బీసీ విద్యార్థి ,యువజన ,ఉద్యోగ ఉపాధ్యాయ మేధావుల సంఘాలు పాల్గొన్నారు. 
 
 

బీసీ ల రాజకీయ చైతన్య బస్సు యాత్ర

No comments:
Write comments