రాహుల్ తో జోష్ వచ్చింది జైపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వోద్దు : డీకే ఆరుణ

 

హైదరాబాద్,ఆగస్టు 23, (globelmedianews.com) 
ఏఐసీసీ పదవులు నాకు వద్దు. నా సర్వీస్ అవసరంఉన్న చోట పనిచేస్తా. ఇతర చోట్ల పనిచేయాల్సిన సమయం కాదిదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే ఆరుణ అన్నారు. గురువారం నాడు గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు  జిల్లా లో అయితే జాయినింగ్స్ ఉన్నాయి. రాహుల్ టూర్ తర్వాత అన్నారు. చూడాలి మరని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం ఏవరనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. ఆ విషయం మా పరిధిలో లేదు. ముఖ్యమంత్రుల నియామకంలో మహిళలకు33శాతం కేటాయిస్తమని రాహుల్ నాతో అయితే అనలేదని అమె అన్నారు. రాహుల్ టూర్ తో మంచి జోష్ వచ్చింది. 
 
 
 
రాహుల్ తో జోష్ వచ్చింది
జైపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వోద్దు : డీకే ఆరుణ
 
మహిళా మీటింగ్ లో మాకు అవకాశం ఇవ్వలేదు. అందుకే మాట్లాడలే. ఇస్తే మాట్లాడే దాన్ని అని అన్నారు. రాహుల్ టూర్ షెడ్యూల్ పీసీసీ ఆధ్వర్యంలో జరిగింది. పీసీసీ రేస్లో  ఉన్నా అని కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ వర్గం పై జరుగుతున్న దాడులను పీసీసీ హ్యాండిల్ చేయాలని అన్నారు. మా జిల్లా లో అభ్యర్థులను భట్టి ఏన్ని గెలుస్తారో చెప్పోచ్చు. 14 కు 14 గెలుస్తామని అన్నారు. జిల్లా లో టిఆర్ఏస్ కు వ్యతిరేకత ఉంది. దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడానికి స్పీడ్ పెంచాలి. అభ్యర్థుల ప్రకటనతో ఓకరిద్దరు ఇబ్బంది పడొచ్చు. వారిని సముదాయించి ముందుకు పోవాలని ఆమె సూచించారు. రేవంత్ రెడ్డి కి మాకు భేదాభిప్రాయాలు లేవు. జైపాల్ రెడ్డి కి మాకు ఏజ్ గ్యాప్ ఉంది. అందువల్లనే విభేదాలని అమె ఆన్నారు. మా అమ్మాయికి టిక్కెట్ కావాలని ఇప్పటి వరకు అడగలేదు. మహాబూబ్ నగర్ పార్లమెంట్  నుంచి పోటి చేస్తామని అడుగుతాం. జైపాల్ రెడ్డి కి మహబూబ్ నగర్ టిక్కెట్ ఇవ్వోద్దు. ఏవరైనా బలమైన బీసీ నేతకు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పామని ఆమె అన్నారు.

No comments:
Write comments