కేరళ కు కోటి రూపాయిల జగన్ సాయం

 

విశాఖపట్టణం, ఆగస్టు 21, (globelmedianews.com)
వర్షాలు, వరదలతో కష్టాల్లో ఉన్న కేరళకు అండగా నిలుస్తోంది యావత్ భారతావని. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అన్ని రంగాల ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తన చేయూతను అందించారు. పార్టీ తరపున కేరళకు రూ.కోటి సాయంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహాయనిధినికి పంపించనున్నారు. వరదలు, వర్షాల నుంచి కేరళ త్వరగా కోలుకోవాలాని జగన్ ఆకాంక్షించారు. జగన్ కేరళలో వర్షాలు, వరదలపై ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం బాధాకరమని.. ఈ కష్ట సమయంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెంట ఉంటాయన్నారు. కేరళ ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు కేంద్రం సహకారం అందించాలని కూడా జగన్ కోరారు. ఇవాళ ఆయన తన సాయాన్ని ప్రకటించారు. కేరళ కు కోటి రూపాయిల జగన్ సాయం

No comments:
Write comments