అప్రమత్తంగా వుండాలి : మంత్రి ఈటల

 

కరీంనగర్,ఆగస్టు 18 (globelmedianews.com)
జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్ధిక,పౌర సరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి విశ్రాంతి గృహం లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో భారీగా కురుస్తున్న వర్షాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే మొదలైనా మద్యలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందారని తెలిపారు. ఈ ఆగష్టు మాసం లో రాష్ట్రం మొత్తం సమృద్దిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంచి వర్షపాతం నమోదు అయింది అని తెలిపారు. జిల్లాలో కుంటలు, చెరువులు , చెక్ డ్యా౦లు నీటితో కళకళ లాడుతున్నాయి అని తెలిపారు . అయితే ఈ సంవత్సరం పంటల సాగుకు భూగర్బ జలాలకు లోటు లేదని తెలిపారు. గత అయిదు ఆరు రోజులుగా కుస్తున్న వర్షాలకు జగిత్యాల ,రాయికల్ కొన్ని మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని కరీంనగర్ లోని కొన్ని లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయని అయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులతో వర్షాలపై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు. అప్రమత్తంగా వుండాలి : మంత్రి ఈటల

No comments:
Write comments