మహిళలకు వెన్ను దన్ను : రాహుల్ గాంధీ

 

హైదరాబాద్, ఆగస్టు 13, (globelmedianews.com)
హైదరాబాద్, మహిళలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు వెళితేనే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. చిన్న రైతులు, వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం రుణాలివ్వడం లేదని ఆయన ఆరోపించారు.  సోమవారం నాడు శంషాబాద్ లోని   క్లాసిక్ కన్వెన్షన్ హాలులో జరిగిన మహిళల ముఖా ముఖి కార్యక్రమానికి అయన హజరయ్యారు .రాహుల్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణ మాఫీ కావడం లేదని ఆయన చెప్పారు. మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో మహిళా సంఘాల అప్పులకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ చెల్లిస్తుందని ఆయన చెప్పారు. ఎన్డీయే సర్కార్ రెండున్నర లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసింది. కానీ మహిళలను విస్మరించింది. దేశం ముందుకు సాగాలంటే మహిళలు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, మహిళలను ఎలా అభివృద్ధి పరచాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని చెప్పారు  మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల పై వడ్డీ మాఫీ వచ్చే కాంగ్రెస్ సర్కారు భరిస్తుంది.  అభయ హస్తం పునరుద్దరిస్తామని అన్నారు.  మహిళలకు వెన్ను దన్ను : రాహుల్ గాంధీ
 
అధికారంలో ఉన్న వారు ఎస్.హెచ్.జి లకు ఋణాలిస్తే మీరు వాటితో వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందొచ్చని అయన అన్నారు. చిన్న వ్యాపారులకు బ్యాంకు లోన్ అవసరం.  కానీ వాళ్ళను విస్మరించి...పెద్ద వ్యాపారులకే లోన్ ఇస్తున్నారు. వచ్చే కాంగ్రెస్ సర్కార్ లో చిన్న వ్యాపారులకు లోన్, మహిళ సంఘాలకు ఋణాళిస్తుందని హమినిస్తున్నాననిఅయన అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. మోడీ దేశం మొత్తం తిరిగి మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. కానీ ప్రకటించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసింది.  నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేసిన విషయం మీరు మర్చిపోయారా...?  మీరు కష్టపడ్డ సొమ్ము బ్యాంకు లో వేశారు.  బ్యాంకుల్లో 12 లక్షల కోట్లు ఉపయోగంలేకుండా పోయాయి.  దీన్తో బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు ఆ డబ్బులను ఋణంగా ఇస్తున్నాయని అన్నారు. 
టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మహిళా సంఘాలకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారని అన్నారు.  
ఆరు లక్షల మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేరని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మహిళా శక్తిని  కేసీఆర్ కుటుంబానికి చూపెట్టాలని పిలుపు నిచ్చారు.

No comments:
Write comments