టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు

 

విజయవాడ, ఆగస్టు 24, (globelmedianews.com)
ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో నేతల వలసలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కదిరి రామారావుతో టీడీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన ఓ సర్వేలో కదిరి రామారావుకు జీరో మార్కులు పడటంతో ....వచ్చే ఎన్నికల్లో ఆయన్ని పక్కనపెట్టాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. అయితే ఎమ్మెల్యే మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదే అనే ధీమాలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా ఇప్పటికే టీడీపీ నేత కళా వెంకట్రావుతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రాజాం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కొండ్రు మురళి రాకను పార్టీ సీనియర్ మహిళా నేత ప్రతిభా భారతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా ఇంకొందరు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు యత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు మాజీలు, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను దగ్గరకు చేర్చేందుకు ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుంటే...మరోవైపు ఆ పార్టీ నేతలు మరోపార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.
 
 
 
టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు

No comments:
Write comments