హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య తీవ్ర దిగ్భ్రాంతి

 

హైదరాబాద్ ఆగష్టు 30 (globelmedianews.com)
రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నాను. ఎన్టీఆర్‌ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.
 
 
 
హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య తీవ్ర దిగ్భ్రాంతి

No comments:
Write comments