లోక్ సభ కు కుమారస్వామి...

 

బెంగళూర్, ఆగస్టు 16 (globelmedianews.com)
కుమారస్వామిని జాతీయ రాజకీయాల్లోకి దేవెగౌడ పంపదలచుకున్నారా? అన్న ప్రచారం జరుగుతోంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా పెద్దగా కంఫర్ట్ గా లేరు. ప్రతి పనికీ కాంగ్రెస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కుమారస్వామిని పోటీచేయించే ఆలోచనలో ఉన్నారా? అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కుమారస్వామి జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణ ముఖ్యమంత్రి అవుతారన్న వదంతుల కన్నడ నాట హల్ చల్ చేస్తున్నాయి.కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా నమ్మకం లేనట్లుంది. 
 
 
 
 లోక్ సభ కు కుమారస్వామి...
 
ఎప్పుడు కాంగ్రెస్ పుట్టి ముంచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని కామెంట్స్ చేశారు. అందుకే దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం కూడా ఉంది. కర్ణాటకలో భారతీజయ జనతా పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికలలో కూడా అతి పెద్ద పార్టీగా బీజేపీయే అవతరించింది. తర్వాత స్థానం కాంగ్రెస్ దే. అయితే గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితిలో కుమారస్వామి ప్రభుత్వం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ తో కలహం లేకుండానే తమకు బలమున్న ప్రాంతాల్లో పోటీ చేయడం, లేని చోట కాంగ్రెస్ కు మద్దతు పలికేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల సంకీర్ణ సర్కార్ మనుగడకు ప్రమాదం ఉండదన్న భావనలో జేడీఎస్ నేతలు ఉన్నారు. కాని కాంగ్రెస్ ను దేవెగౌడ ఎట్టిపరిస్థితుల్లో నమ్మరు. అందుకే ఆయన తన కుమారుడు కుమారస్వామిని జాతీయ రాజీకీయాలకు పరిచయం చేయాలని భావిస్తున్నారు.మరోవైపు రేవణ్ణ మాత్రం తాను కుమారస్వామి స్థానంలో ముఖ్యమంత్రి అవుతానన్న వదంతులను కొట్టిపారేస్తున్నారు. తాను అటువంటి ఆలోచనలో లేనని రేవణ్ణ చెప్పారు. అయితే పార్టీ ఎలాంటి బాధ్యతలను అప్పగించింనా తాను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం. కాని కుమారస్వామి జాతీయ రాజకీయాల్లోకి వెళతారా? లేదా? అన్నది తాను చెప్పలేనన్నారు. మొత్తం మీద కన్నడ రాజకీయాలతో దేవెగౌడ విసిగిపోయి కుమరస్వామిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతున్నాన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందోచూడాలి.

No comments:
Write comments